తల్లి ఉష నుంచి కాస్ట్‌లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ పొందిన శింబు.. సంతోషపడిపోతున్న నటుడు

నటుడు శింబు తన తల్లి ఉష రాజేందర్ నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ని పొందారు. చాలా రోజులుగా ఈ హీరో మనసులో ఉన్న కోరికను పనిగట్టిన ఉష

తల్లి ఉష నుంచి కాస్ట్‌లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ పొందిన శింబు.. సంతోషపడిపోతున్న నటుడు
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2020 | 10:01 AM

Simbu surprise Gift: నటుడు శింబు తన తల్లి ఉష రాజేందర్ నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ని పొందారు. చాలా రోజులుగా ఈ హీరో మనసులో ఉన్న కోరికను పనిగట్టిన ఉష.. తాజాగా అతడి కోరికను నెరవేర్చింది. ఆకుపచ్చ కలర్‌లో ఉండే మినీ కూపర్ కార్‌ని ఉష, శింబుకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక అమ్మ ఇచ్చిన గిఫ్ట్‌తో శింబు సంతోషపడిపోతున్నారు.

కాగా సినిమాల విషయాలకొస్తే.. ఆ మధ్యన బాగా గ్యాప్ తీసుకున్న శింబు.. మళ్లీ బిజీ అవుతున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో ఈశ్వరన్ అనే మూవీ షూటింగ్‌ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు శింబు. ఇక ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ హీరో మానాడులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది.