Breaking News
  • తిరుమల: రేపు తిరుమలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రేపు తిరుమలకు విచ్చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న కర్ణాటక సీఎం యడియూరప్ప. రేపు రాత్రి తిరుమలలోనే బస చేయనున్న ముఖ్యమంత్రులు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై వేద పారాయణంలో పాల్గొననున్న ముఖ్యమంత్రులు. అనంతరం ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం జగన్, యడియూరప్ప. అనంతరం తిరుగు ప్రయాణం.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • రెండవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ లపై కొనసాగిన విచారణ. రెండవ రోజు బయట పడ్డ నగేష్ ముగ్గురు బినామీలు. ముగ్గురు బినామీలను విచారించిన ఏసీబీ. నగేష్ భినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామి. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డి లో పలు అక్రమాలను గుర్తించిన ఏసీబీ. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం విచారించిన ఏసీబీ.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

భారత్‌, చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు !

భారత్‌, చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. డ్రాగన్‌ చొరబాటు కుట్రలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి, భారీగా బలగాల మోహరించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్నటెన్షన్‌ నెలకొంది.
Signs of war again on the India-China border, భారత్‌, చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు !

భారత్‌, చైనా సరిహద్దులో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంచుకొండలు నివురుగప్పిన నిప్పులా మారాయి. డ్రాగన్‌ చొరబాటు కుట్రలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఇరు దేశాలు యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి, భారీగా బలగాలను మోహరించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

ఎల్‌ఏసీ వెంబడి మూడ్రోజులుగా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది జిత్తులమారి చైనా. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చుముర్‌ ప్రాంతంలోకి చొరబడేందుకు విఫలయత్నం చేసింది డ్రాగన్‌. కీలక ప్రాంతమైన బ్లాక్‌టాప్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎత్తులు చేసింది. కాని చైనా డ్రామాలను పసిగట్టిన భారత్‌..సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Signs of war again on the India-China border, భారత్‌, చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు !

ఎల్‌ఏసీ వైపు చైనాకు చెందిన 8 భారీ వాహనాలు చొచ్చుకొచ్చాయి. చైనా సైన్యాన్ని గమనించిన భారత్ వెంటనే అప్రమత్తమైంది. డ్రాగన్ కంటే ముందే ఆ ప్రాంతంలో మోహరించింది. దీంతో భారత దళాలను చూసి తోకముడుచుకొని పారిపోయింది డ్రాగన్‌ సైన్యం.

కీలక పర్వత శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకొని ఆ ప్రాంతంపై పూర్తిగా పట్టుబిగించింది భారత్‌. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ-ప్లా బ్లాక్‌టాప్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కెమెరాలను , నిఘా వ్యవస్థను తొలగించింది. చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు తన నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది. ఈ చర్యను చైనా జీర్ణించుకోలేకపోతోంది. కనీసం రెండు పర్వత శిఖరాల నుంచి భారత దళాలను ఖాళీ చేయించేందుకు పదేపదే విఫలయత్నం చేస్తోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది. ఫలితంగా ఇరు దేశాల సైనిక మోహరింపులు ముమ్మరమయ్యాయి.

Signs of war again on the India-China border, భారత్‌, చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు !

ఈ ఘటన తరువాత శ్రీనగర్‌ – లేహ్‌ హైవే చాలా హడావుడి కన్పిస్తోంది. లేహ్‌కు పెద్ద ఎత్తున సైనిక వాహనాలు తరలివెళ్తున్నాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికైనా సిద్దంగా ఉన్నట్టు భారత సైన్యం ప్రకటించింది. గత నెల 29,30 తేదీల్లో కూడా భారత్‌లోకి చొరబడేందుకు చైనా విఫలయత్నం చేసిందని తెలిపాయి భారత దళాలు. డ్రాగన్‌ పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని వెల్లడించాయి. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే..పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది భారత్‌. తమ సైన్యం సకాలంలో స్పందించి చైనా చర్యలకు అడ్డుకట్ట వేశామంటోంది.

ఐతే బ్లాక్‌టాప్‌ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. భారత్‌ వెనక్కి పోవాలని ప్రకటనలు చేస్తోంది. తాము ఇతర దేశాల భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని, కవ్వింపు చర్యలకు పాల్పడలేదని ప్రకటించింది. భారత్‌, చైనా మధ్య ఇంకా సరిహద్దులు ఖరారు కాలేదని, అందువల్లే తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ. విభేదాలు.. ఘర్షణలుగా మారకూడదని..ఇరు దేశాల అగ్రనాయకులు తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ద్వారా భారత్‌తో అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Signs of war again on the India-China border, భారత్‌, చైనా సరిహద్దులో యుద్ధ మేఘాలు !

ఐతే ఒకవైపు చర్చల పేరుతో శాంతి మంత్రం జపిస్తూనే ..మరోవైపు తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో రెండు హెలిపోర్టులు నిర్మిస్తోంది చైనా. గాల్వన్ లోయ పక్కనున్న టిన్‌షున్‌, రుటోగ్‌ కౌంటీలో సైలెంట్‌గా నిర్మాణాలు చేపట్టింది. తన సైన్యాన్ని లద్దాఖ్‌ ప్రాంతానికి తరలించేందుకు వీలుగా ఈ హెలిపోర్టుల నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు రక్షణ శాఖ నిపుణులు.

ఇరు దేశాల మధ్య తాజా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై బ్రిగేడియర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల పాటు చర్చించిన అధికారులు..ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు.

Related Tags