ప్రపంచ అద్భుతం అభనేరి మెట్ల బావి!

పాపిష్టి కరోనా వైరస్‌ పర్యాటకరంగపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.. సంతోషంగా ఓ వేడుకనో, ఉత్సవాన్నో జరుపుకునే వీల్లేకుండా చేసిందా పాడు వైరస్‌! అసలు ఎవరిలోనూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్న ఉత్సాహమే కనిపించడం లేదు..

ప్రపంచ అద్భుతం అభనేరి మెట్ల బావి!
Follow us

|

Updated on: Sep 17, 2020 | 2:04 PM

పాపిష్టి కరోనా వైరస్‌ పర్యాటకరంగపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.. సంతోషంగా ఓ వేడుకనో, ఉత్సవాన్నో జరుపుకునే వీల్లేకుండా చేసిందా పాడు వైరస్‌! అసలు ఎవరిలోనూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్న ఉత్సాహమే కనిపించడం లేదు.. కరోనా లేకపోయి ఉంటే ఇవాళ రాజస్థాన్‌లోని అభనేరి టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉండేది.. అక్కడున్న 13 అంతస్తుల బావి దగ్గర ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి.. రాజస్తానీ సంప్రదాయ నృత్యగీతికలు, తోలుబొమ్మలాటలు, ఒంటెలపై విహారాలు చాలా వినోద కార్యక్రమాలు ఉండేవి.. కరోనా కారణంగా అభనేరి ఫెస్టివల్‌ ఎలాగూ క్యాన్సల్‌ అయ్యింది.. సందర్భం వచ్చింది కాబట్టి అసలు అభనేరి ప్రత్యేకత ఏమిటో ఓసారి పరికిద్దాం..రాజస్థానలోని అభనేరి అనే గ్రామంలో ఉన్న మెట్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది.. దేశంలో అద్భుత కట్టడాలలో ఇది కూడా ఒకటి. ఏకంగా 13 అంతస్తులు ఉంటుందీ బావి.. 3,500 మెట్లతో, 30 మీటర్ల లోతుతో ప్రపంచంలోనే అతి పెద్ద బావిగా ప్రఖ్యాతిగాంచింది.. ఎనిమిదో శతాబ్దంలో నికుంభ వంశానికి చెందిన చంద అనే రాజు కట్టించాడీ బావిని. అందుకే దీన్ని చాంద్‌ వవోరి అంటారు.. ఈ బావి దగ్గర టెంపరేచర్లు చాలా తక్కువగా ఉంటాయి.. చుట్టుపక్కల ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం అయిదారు డిగ్రీల తక్కువగా ఉంటుంది.. అందుకే ఈ బావికి ఒక పక్క ఉన్న గదుల్లో ఆనాటి రాజులు విశ్రాంతి తీసుకునేవారు. ఏడాది పొడవునా ఈ బావిలో నీళ్లు ఉంటాయి.. ఇప్పటివరకు ఎండిపోయింది లేదు.. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వేసవి కాలంలో వేడికి తట్టుకోలేక చల్లదనం కోసం ఆ బావి దగ్గరకొస్తారు. వేసవి కాలంలో అడుగున కనిపించే నీళ్లు, వర్షాకాలం వస్తే పై వరకు వస్తాయి. ఈ బావిలోకి దిగడానికి మూడువైపులా మెట్లు ఉన్నాయి. నాలుగో వైపు అందమైన మంటపాలు ఉన్నాయి. బావి సమీపంలోనే హర్షత్‌ మాత ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు బావిలోని నీటితో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి వెళతారు. ఇక్కడ వెలసిన అమ్మవారు ఊరంతటికీ తేజస్సును అందిస్తుందనేది ప్రజల నమ్మకం. అందుకే ఊరి పేరు అభానగరిగా ప్రసిద్ధి పొందింది.. రానురాను అదే అభనేరిగా మారింది..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!