అతి నిద్ర అనర్థదాయకం!

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. నిద్ర వ‌ల్ల మన శ‌రీరం పున‌రుత్తేజం చెందుతుంది. శ‌రీరంలోని క‌ణ‌జాలం మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతుంది. క‌ణాల‌కు కొత్త శ‌క్తి వ‌స్తుంది. నిద్ర‌పోతే మ‌రుస‌టి రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. అందుకు గాను ప్ర‌తి రోజూ మ‌నం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాలి. అయితే కొంద‌రు చాలా ఎక్కువ‌గా.. అంటే.. రోజుకు 8 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు నిద్రిస్తుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. ఇలా […]

అతి నిద్ర అనర్థదాయకం!
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 5:14 PM

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. నిద్ర వ‌ల్ల మన శ‌రీరం పున‌రుత్తేజం చెందుతుంది. శ‌రీరంలోని క‌ణ‌జాలం మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతుంది. క‌ణాల‌కు కొత్త శ‌క్తి వ‌స్తుంది. నిద్ర‌పోతే మ‌రుస‌టి రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. అందుకు గాను ప్ర‌తి రోజూ మ‌నం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాలి. అయితే కొంద‌రు చాలా ఎక్కువ‌గా.. అంటే.. రోజుకు 8 గంట‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు నిద్రిస్తుంటారు. నిజానికి ఇది మంచిది కాదు. ఇలా అతిగా నిద్రించ‌డం వల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

రోజుకు 8 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా నిద్రించే వారికి డ‌యాబెటిస్‌, హైబీపీ, గుండె జ‌బ్బులు వ‌స్తాయని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అతిగా నిద్రిస్తే బ‌ద్ద‌కం పెరిగిపోతుంది. ఎప్పుడూ మ‌బ్బుగా ఉంటారు. నీర‌సంగా అనిపిస్తుంది. శ‌క్తి లేన‌ట్లు ఉంటుంది. అలాగే అధికంగా బ‌రువు పెరుగుతార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక అతిగా నిద్రించ‌రాదు. నిత్యం 6 నుంచి 8 గంటల పాటు మాత్ర‌మే నిద్రించాలి. దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.