ఇష్టమైందల్లా తింటున్నారా.. ఇక మీరు అంతే..

ఎమోషనల్ ఈటింగ్.. ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు.. సరే దీని గురించి వివరంగా చెబుతాను చూడండి. మీరు ఎప్పుడైనా పార్టీ చేసుకుంటున్నప్పుడు గానీ.. లేదా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు గానీ మీకు ఈ ఎమోషనల్ ఈటింగ్ కలుగుతుంది. అక్కడ ఉన్న తిను బండారాలన్ని మీకు తినాలని అనిపిస్తుంది. మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోయి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ ఈటింగ్ అనేది మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే […]

ఇష్టమైందల్లా తింటున్నారా.. ఇక మీరు అంతే..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:19 PM

ఎమోషనల్ ఈటింగ్.. ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు.. సరే దీని గురించి వివరంగా చెబుతాను చూడండి. మీరు ఎప్పుడైనా పార్టీ చేసుకుంటున్నప్పుడు గానీ.. లేదా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు గానీ మీకు ఈ ఎమోషనల్ ఈటింగ్ కలుగుతుంది. అక్కడ ఉన్న తిను బండారాలన్ని మీకు తినాలని అనిపిస్తుంది. మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోయి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ ఈటింగ్ అనేది మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే చిన్న సమస్య.  మన డైట్స్‌లో గానీ, మనం తినే పదార్ధాల్లో గానీ పరిమితులు పెట్టుకోకుండా వల్ల మనం ఈ సమస్య‌ను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.

మీరు ఏదైనా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు… మీకు తెలియకుండానే ఎక్కువ తినేస్తుంటారు. అప్పుడు అసలు మీకు ఏమి జరుగుతోందో కూడా తెలియదు. దీనికి ఒకటే పరిష్కారం మీరు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. తినేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని దృష్టిలో పెట్టుకోండి. ఇదొక్క సందర్భమే కాదు.. ఆఫీస్‌లో స్ట్రెస్, బోర్ ఫీల్ అయినప్పుడు, ఎవరితో అయినా గొడవ పడినప్పుడు గానీ.. మీ మనసు మీ మాట వినదు. ఇక ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తిండి దగ్గరికి తీసుకురావద్దు. తినే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరో వైపు మీరు ఆనందంగా తినడం అలవాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేదా ఆఫీస్ టెన్షన్స్ లో గానీ ఉన్నప్పుడు.. మీ మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే కోపాన్ని మాత్రం మీరు ఎప్పుడూ తిండి దగ్గర చూపించవద్దు. వాటన్నింటిని దూరం చేసుకోవడం కోసం ఆహారాన్ని ఒక ఆయుధంగా ఎంచుకుంటే మీకు చాలా మంచిది.  

ఇకపోతే చాలామంది వ్యక్తులు అసౌకర్యమైన ఆహారాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. సౌకర్యంగా ఉండే ఆహారాలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే.. అవి మాత్రం ఎమోషన్స్ నుండి మనల్ని దూరం చేస్తాయి. ఉదాహరణకు మనం ఆవేశంగా తిందాం అని అనుకున్నప్పుడు మనకు మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది.. కేక్, పాస్తా, పిజ్జా లేదా చిప్స్. ఆ సమయంలో మనం సౌకర్యమైన ఆహరం తీసుకోవడం కన్నా.. ఇవి తీసుకుంటేనే మనకు ఎమోషనల్ గా తినడం అనేది తగ్గుతుందని నిపుణుల సలహా.

ఇది ఇలా ఉంటే ఎమోషనల్ ఈటింగ్ అనేది మనకు సరిగ్గానే ఉండవచ్చు. కానీ ఇది అలవాటుగా మారితేనే మానసికంగా, శారీరికంగా మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ అసౌకర్యమైన ఆహారాలు తినడం వల్ల శారీరికంగా.. మనసులో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్‌ను దాచుకోవడం వల్ల మానసికంగా దెబ్బపడుతుంది. ఏది ఏమైనా ఎమోషనల్ ఈటింగ్‌కు మీరు దూరంగా ఉంటే మంచిదని వారి సలహా.   

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..