Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

రాత్రిపూట చపాతీలు తింటున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..

బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి యువత ఎక్కువగా రాత్రి వేళల్లో అన్నం కంటే చపాతీలు తింటానికే మక్కువ చూపిస్తుంటారు. అటు డాక్టర్లు కూడా స్థూలకాయం దరికి చేరకుండా ఉండేందుకు చపాతీలు తినమని సజెస్ట్ చేస్తుంటారు కూడా. అయితే రాత్రిపూట వేడివేడిగా చేసుకునే చపాతీలు కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అప్పటికప్పుడు చేసిన చపాతీల్లో నూనె కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఎక్కువసేపు నిల్వ ఉన్న పదార్థాలను మనం తరచూ పడేస్తుంటాం. ఏదైనా ఆహారం వండిన తర్వాత సుమారు 12 గంటలు నిల్వ ఉంటే అందులోని పోషక పదార్ధాలు అంతమైపోతాయి. అందుచేత ఆ పదార్ధాలను మనం పడేస్తాం. కానీ చపాతీలు, రోటీలు ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

అందుకే రాత్రిపూట నిల్వ ఉంచిన చపాతీలు తినాలంటున్నారు. అలా తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయని అంటున్నారు. దానితో డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు కూడా నయమవుతాయట. మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట అప్పటికప్పుడు చేసుకునేవి కాకుండా నిల్వ ఉన్న చపాతీలను ట్రై చేయండి.