రంగనాయక సాగర్ నీటి విడుద‌ల‌..కాల్వ‌లో ఈత కొట్టిన ఏంపీ, ఎమ్మెల్యే

చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు.

రంగనాయక సాగర్ నీటి విడుద‌ల‌..కాల్వ‌లో ఈత కొట్టిన ఏంపీ, ఎమ్మెల్యే
Follow us

|

Updated on: May 02, 2020 | 5:07 PM

సిద్దిపేట జిల్లా వాసుల క‌ల సాకార‌మైంది. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు  ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు. ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు మల్లన సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ నాలుగవ గేట్ ఎత్తి ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్ నీరు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…  కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేసిన ఈ రోజు తనకు ఎన్నటికీ మరపురాదని పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు  చెబుతున్నానన్నారు.  ఏడాది పొడవునా నీళ్లు వస్తాయనీ, కరవుకు ఇక శాశ్వతంగా చెక్ పెట్టేశామని హరీష్ రావు పేర్కొన్నారు.   కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు.
ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో ఆనందంతో కాల్వ జాలాల‌ను ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ హరీష్ రావు తన ఆనందాన్ని వ్యక్తం  చేశారు. మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు.