స్టైలీష్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టిన హరీష్‌రావు.. సిద్ధిపేట ఇండోర్‌ స్టేడియంలో దుమ్మురేపిన మంత్రి

విరాట్ కోహ్లీ తరహాలో విరుచుకు పడ్డారు. సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టారు. 12 బంతుల్లో 18 పరుగులు చేశారు మంత్రి హరీష్ రావు. హరీష్ రావు దూకుడుకు అభిమానులు ఫాదా అయ్యారు…

  • Sanjay Kasula
  • Publish Date - 1:02 am, Thu, 3 December 20

దుబ్బాక దంగల్.. గ్రేటర్ వార్ ముగిసింది. దీంతో మంత్రి హరీష్ రావు ఆటవిడుపుగా సిద్దిపేటలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు, సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగారు. అయితే.. తన టీమ్ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో మంత్రి హరీష్ రావు బ్యాటింగ్‌కు దిగారు. బౌండరీలో వీరవిహారం చేశారు. బ్యాటింగ్‌కి దిగిని మంత్రి హరీష్‌రావు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లో స్టైలీష్‌గా బ్యాటింగ్ చేశారు.

విరాట్ కోహ్లీ తరహాలో విరుచుకు పడ్డారు. సునాయాసంగా పరుగులు తీస్తూ వరుసగా రెండు ఫోర్లను కొట్టారు. 12 బంతుల్లో 18 పరుగులు చేశారు మంత్రి హరీష్ రావు. హరీష్ రావు దూకుడుకు అభిమానులు ఫాదా అయ్యారు. రాజకీయాల్లో మాత్రమే కాకుండా క్రికెట్‌లో కూడా తనదైన వ్యూహాలతో టీంకు కెప్టెన్‌గా వ్యవహరించారు. హరీష్ రావు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఫ్యాన్స్, ప్రేక్షకులను కేరింతలు కొడుతూ, ఈలలేస్తూ సందడి చేశారు.

ఇక మైదానంలో తొలిసారిగా ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ఇంటర్‌నేషనల్ క్రికెట్‌ టోర్నీలను తలదన్నేలా మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్‌ డాక్టర్స్‌ జట్టుతో సిద్దిపేట క్రికెట్ క్లబ్ టీమ్‌ ఫస్ట్ మ్యాచ్ ఆడుతోంది. సిద్ధిపేట క్రికెట్ క్లబ్ టీమ్‌కి కెప్టెన్‌గా తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ మెడికవర్ టీమ్‌తో స్థానిక జట్టుకు జరుగుతున్న ఈ ఫ్రెడ్లీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ డాక్టర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిద్దిపేట జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్‌ ఆసుపత్రి జట్ల మధ్య జరిగిన ఈ స్నేహపూర్వక టీ20 మ్యాచ్ లో  హరీశ్‌ 18 రన్స్‌ చేయగా,  సిద్ధిపేట టీమ్‌ మ్యాచ్‌ గెలిచింది.