కశ్మీర్‌లో టూరిజం… కేంద్రం సంచలన నిర్ణయం!

కశ్మీర్‌లో టూరిజం అభివృద్ధికి సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సియాచిన్ ప్రాంతంలోకి టూరిస్టులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. లడఖ్‌లో టూరిజానికి అద్భుత అవకాశాలున్నాయని అన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చునని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా సియాచిన్‌కు పేరు ఉంది. సియాచిన్, కార్గిల్ ప్రాంతాలలో సైనిక శిభిరాలు ఉన్నాయి. ఇప్పటి […]

కశ్మీర్‌లో టూరిజం... కేంద్రం సంచలన నిర్ణయం!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2019 | 12:17 PM

కశ్మీర్‌లో టూరిజం అభివృద్ధికి సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సియాచిన్ ప్రాంతంలోకి టూరిస్టులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. లడఖ్‌లో టూరిజానికి అద్భుత అవకాశాలున్నాయని అన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చునని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా సియాచిన్‌కు పేరు ఉంది. సియాచిన్, కార్గిల్ ప్రాంతాలలో సైనిక శిభిరాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ సియాచిన్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల భయం ఉండేది. ఆర్టికల్ 370 రద్దుతో ఆ భయాలన్నీ పోయాయని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత సైనిక శిబిరాలను సందర్శించాలన్న దేశ ప్రజల కోరిక నెరవేరనుంది.