యువకుడిపై ఎస్ఐ దాడి..

SI brutally attack on young man at Tukaram Gate, యువకుడిపై ఎస్ఐ దాడి..

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ యువకుడిని చితకబాదారు. తుకారాంగేట్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు అక్కడను చేరుకుని యువకుల్ని స్టేషన్‌కు తరలించారు. సాయి అనే యువకుడిని చితకబాదారు. దీంతో అతని నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న యువకుడి స్నేహితులు ఇదంతా వీడియోలో చిత్రీకరించడంతో.. పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్‌ఐ రామ్‌లాల్‌, కానిస్టేబుల్‌ నాయక్‌ కొట్టారని, తాను కనీసం మద్యం కూడా తాగలేదని సాయి వాపోయాడు. ఇదిలాఉండగా.. ఓ సిగరెట్‌ వివాదంలో సదరు యువకుడు పోలీసులతో అతిగా స్పందించినట్టు తెలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *