Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ఆర్మీ ఇక బేఫికర్ ! సరికొత్త సూట్ వచ్ఛేసింది

Varanasi resident creates Iron Man suit 'prototype' to help soldiers, ఆర్మీ ఇక బేఫికర్ ! సరికొత్త సూట్ వచ్ఛేసింది

సూపర్ హీరోల సినిమాల్లో ఐరన్ మ్యాన్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇందుకేనేమో వారణాసికి చెందిన ఓ యువకుడు మార్వెల్ ఐకాన్ హీరో ఐరన్ మ్యాన్ సూట్ ని తయారు చేసి, దాన్ని భారత ఆర్మీకి ప్రెసెంట్ చేస్తానంటూ ముందుకు వచ్చాడు..
అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగి శ్యామ్ చౌరాసియా ఈ సెమీఫంక్షనల్ సూట్ ని రూపొందించాడు .సైనికులు తమ శత్రువులపై పోరాడటానికి ఈ సూట్ ఎంతగానో సహాయపడుతుందని అతను చెబుతున్నాడు..
ఇది భారత సైనికులు ఉగ్రవాదులు,శత్రువులను ఎన్‌కౌంటర్ చేసే సమయంలో సహాయపడటానికి రూపొందించిన ఒక మెటల్ సూట్. ప్రస్తుతం ఇది కేవలం ఒక నమూనా మాత్రమే, ఫండ్స్ ఇస్తే దీన్నీ మరింతగా డెవలెప్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

గేర్లు, మోటార్లతో ఈ సూట్ లో కదలికలుంటాయి.. మొబైల్ కనెక్షన్ తో పాటు సెన్సార్ కలిగి ఉన్నందున ఇది శత్రువుల కదలికలను ఇట్టే కనిపెట్టేయగలదు, శత్రువు వెనకనుంచి వచ్చినా సరే.. ముందున్న హెల్మెట్ లో వారిని స్పష్టంగా చూడొచ్చు అని చెబుతున్నాడు.
దీనిపై నెటిజన్లు ఎన్నో రకాలుగా రియాక్ట్ అవుతున్నారు..కొందరు ఈ ఐడియాను మెచ్చుకుంటూ ఉంటే మరికొందరు ఇలాంటి సూట్ ని ఆర్మీవాళ్లు వేసుకుంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లకు వెళ్లినట్టుగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.