చిరు సరసన శ్రుతీహాసన్..?

‘సైరా’ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు కొరటాల. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో శ్రుతీ నటించగా.. ఇప్పుడు చిరు చిత్రం కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ […]

చిరు సరసన శ్రుతీహాసన్..?
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 4:00 PM

‘సైరా’ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు కొరటాల. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో శ్రుతీ నటించగా.. ఇప్పుడు చిరు చిత్రం కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ కోసం గతంలో నయనతార, అనుష్క, తమన్నా పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. ఒకవేళ మెగాస్టార్ నటించేందుకు శ్రుతీ ఒప్పుకుంటే మెగా ఫ్యామిలీ టాప్ హీరోలందరితో నటించిన హీరోయిన్‌ లిస్ట్‌లో చేరుతుంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో కాజల్, తమన్నా ఉన్నారు. అయితే ‘కాటమరాయుడు’ చిత్రం తరువాత టాలీవుడ్‌కు దూరమైన శ్రుతీ హాసన్ ప్రస్తుతం మ్యూజిక్ షోలను చేస్తోంది.