లండన్‌ వీధుల్లో.. శృతి డ్యాన్స్‌..!

విశ్వనటుడు కమల్ హాసన్, అందాల తార సారిక వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శృతీహాసన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అందాల భామ మంగళవారంతో 34వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం లండన్‌ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది శృతిహాసన్‌. ఈ బ్యూటీ తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో జరుపుకుంది. శృతిహాసన్‌ తన స్నేహితులతో కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతూ..డ్వీబీ డ్యాన్స్‌ చేసింది. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకు, […]

లండన్‌ వీధుల్లో.. శృతి డ్యాన్స్‌..!
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 11:01 PM

విశ్వనటుడు కమల్ హాసన్, అందాల తార సారిక వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శృతీహాసన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అందాల భామ మంగళవారంతో 34వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం లండన్‌ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది శృతిహాసన్‌. ఈ బ్యూటీ తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో జరుపుకుంది. శృతిహాసన్‌ తన స్నేహితులతో కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతూ..డ్వీబీ డ్యాన్స్‌ చేసింది.

ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నాపై అందరి ప్రేమ, దీవెనలున్నాయి. నేను అదృష్టవంతురాలిని అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్‌ పోస్ట్‌ చేసింది. తన పుట్టినరోజును మరిచిపోలేని విధంగా జరిపిన లండన్‌ స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

https://www.instagram.com/p/B73ovOrB9Rp/?utm_source=ig_web_copy_link