శ్రుతికి కోపం వచ్చింది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయంది..

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌కు మంచి పేరుంది. అంతేకాకుండా కమల్ తనయురాలిగా ఇండస్ట్రీలో తనకు ఓ బ్రాండ్ ఉండనే ఉంది.

  • uppula Raju
  • Publish Date - 1:42 pm, Tue, 24 November 20
శ్రుతికి కోపం వచ్చింది.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయంది..

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌కు మంచి పేరుంది. అంతేకాకుండా కమల్ తనయురాలిగా ఇండస్ట్రీలో తనకు ఓ బ్రాండ్ ఉండనే ఉంది. అయితే ఇటీవల ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా కేంద్రంగా ఓ వివాదం నడుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో ఎవ్వరికీ చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయిందట. దీనికి సంబంధించి శ్రుతి ఓ ట్వీట్ కూడా చేసింది. మరి ఆ విశేషాలేంటో ఇప్పడు చూద్దాం.

తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘లాభం’ సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు అక్కడికి చాలామంది జనం వచ్చారు. అయితే కరోనా భయంతో శ్రుతి ఎవ్వరికీ చెప్పకుండా షూటింగ్ మధ్య నుంచి ఎస్కేప్ అయింది. అంతేకాకుండా చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా షూటింగ్ ఎలా చేస్తారని మండిపడింది. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తాను షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు శ్రుతి ఇటీవల సోషల్‌మీడియా కేంద్రంగా వెల్లడించింది.