తల్లి పాత్రలో శ్రియ

Shriya Saran upcoming movie, తల్లి పాత్రలో శ్రియ

సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ వెండితెరపై సుదీర్ఘ కాలంగా కెరియర్‌ను కొనసాగిస్తోన్న కథానాయకలలో శ్రియ ఒకరు. తెలుగు-తమిళ భాషల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా తెలుగులో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనుందని సమాచారం. చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ కథ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శ్రియ పదేళ్ల పాపకు తల్లిగా కనిపిస్తుందని తెలుస్తోంది. గతంలో శ్రియ గౌతమీపుత్ర శాతకర్ణి, గోపాల గోపాల సినిమాల్లో తల్లిపాత్రల్లో మెప్పించింది. ముందుగా ఈ సినిమాను పూర్తి చేసేసి, ఆ తరువాతనే నితిన్ తో కలిసి చంద్రశేఖర్ యేలేటి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *