ముంబయి: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందా? అంటే… అవుననే అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు. 2020లో ఆమె చేసుకోబోతున్నట్లు వార్తలు అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా శ్రద్ధ రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్లో ఉన్నారట. దీనికి సంభందించి చాలా ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా ఒకరితో ఒకరికి పరిచయం ఉండటంతో అతన్ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చెయ్యాలని శ్రద్ధ భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు భోగట్టా. శ్రద్ధ వయసు కూడా 30 దాటడంతో ఇంట్లో కూడా పెళ్లి పట్ల బలవంత పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంట్లోవారికి రోహన్ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో శ్రద్ధ ఓ ఇంటివారు అవుతారు. ఒకప్పుడు శ్రద్ధ, ఫర్హాన్ అక్తర్ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం శ్రద్ధ తెలుగులో ప్రస్టీజియస్ ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ‘చిచ్ఛోరే’, ‘ఏబీసీడీ 3’ సినిమాల్లోనూ ఆమె నటిస్తుంది.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.