సీన్ రివర్స్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై కారంపొడితో దాడి..!

దేశ వ్యాప్తంగా ఇంకా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పలు చోట్ల వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. అయితే నిత్యం ఎక్కడో ఓ చోట ఈ ఆందోళనలు కొనసాగుతూ.. షాపులను మూసివేస్తుండటంతో.. దుకాణాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని యావత్మాల్ పట్టణంలో […]

సీన్ రివర్స్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై కారంపొడితో దాడి..!
Follow us

| Edited By:

Updated on: Jan 30, 2020 | 2:08 PM

దేశ వ్యాప్తంగా ఇంకా సీఏఏ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. పలు చోట్ల వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. అయితే నిత్యం ఎక్కడో ఓ చోట ఈ ఆందోళనలు కొనసాగుతూ.. షాపులను మూసివేస్తుండటంతో.. దుకాణాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని యావత్మాల్ పట్టణంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త బంద్‌లో భాగంగా యవత్మాల్ పట్టణంలో.. సీఏఏ వ్యతిరేక సంఘాలకు చెందిన ఆందోళనకారులు స్థానిక మార్కెట్‌లోని దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఈ క్రమంలో కొన్ని షాపులకు చెందిన ఓనర్లు.. ఆందోళనకారులతో విభేదించారు. ఆందోళనకారులు, దుకాణదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. షాపులు మూసేయం అంటూ వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు అక్కడే ఉన్నా.. వారు ప్రేక్షక పాత్ర పోషించారు. అయితే షాపుల్ని మూసేయాల్సిందేనంటూ.. ఆందోళనకారులు బలవంతం చేస్తుండటంతో.. దుకాణాదారులు కూడా వెనక్కితగ్గలేదు. దుకాణంలోని.. కారంపొడిని తీసుకుని.. ఆందోళనకారులపై చల్లేందుకు ప్రయత్నించారు. ఓ షాపు మూసేందుకు వెళ్లిన ఆందోళనకారులపై.. అక్కడే ఉన్న దుకాణంలోని దంపతులు.. కారం పొడి ప్యాకెట్లు పట్టుకుని.. వారిపై చల్లేందుకు ఎదురుగా రావడంతో.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.