తిరుమలలో శాస్త్రోక్తంగా షోడశదిన సుందరకాండ దీక్ష ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమ‌ల‌లో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. టీటీడీ ఆధ్వర్యంలో వసంత మండపంలో 16 రోజుల పాటు

  • Manju Sandulo
  • Publish Date - 11:46 am, Tue, 29 September 20

shodasadina sundarakanda deeksha: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమ‌ల‌లో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. టీటీడీ ఆధ్వర్యంలో వసంత మండపంలో 16 రోజుల పాటు ఈ దీక్ష జరగనునుంది. ఈ దీక్షలో16 మంది సుందరకాండ ఉపాసకుల చేత సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గల‌ను పారాయ‌ణం చేయించనున్నారు.

దీనిపై టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లోక క్షేమార్ధం తిరుమలలో‌ షోడశదిన పారాయణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కరోనా నుంచి యావత్తు ప్రజలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ఉపాసకుల చేత ఈ పారాయణం కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. 16 రోజుల పాటు ఉపాశకులు కఠోరమైన నియమాలను పాటిస్తూ స్వామి వారి ఆశీస్సులతో దీక్షను కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్‌ ద్వారా ఈ సుందరకాండ పారాయణం భక్తులకు వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇక అక్టోబర్‌ 14 వరకు ఈ దీక్ష జరగనుండగా.. అక్టోబర్‌ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Read More:

రామచంద్రపై దాడి కేసు.. చంద్రబాబుకు లేఖ రాసిన ఏపీ డీజీపీ

అంతర్వేది: డిసెంబర్ నాటికి కొత్త రథం పూర్తి