ఇదేం చోద్యం..ఆటోలో వెళితే.. హెల్మెట్‌ లేదని జరిమానా!

నూతన మోటర్ వెహికల్(సవరణ) యాక్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్స్ దంచుతున్నారు. అయితే కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనడంలో కూడా ఆశ్యర్యం లేదు. సాధారణంగా హెల్మెట్‌ ఎప్పుడు పెట్టుకోవాలి? ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడేనన్నది అందరికీ తెలిసిన సంగతే. హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఆటో డ్రైవర్‌కూ బెజవాడ ట్రాఫిక్ పోలీసులు జరిమానా  వేశారు   ఏపీ16టిఎన్‌8597′.. నంబరు గల ఆటో యజమానికి ట్రాఫిక్ విభాగం పోలీసులు ఐదు చలానాలు పంపించారు. వీటికి సంబంధించిన రుసుము ఈ నెల 3న సదరు ఆటో డ్రైవర్ చెల్లించాడు. […]

ఇదేం చోద్యం..ఆటోలో వెళితే.. హెల్మెట్‌ లేదని జరిమానా!
auto driver challaned Rs 185 for without helmet
Follow us

|

Updated on: Sep 07, 2019 | 11:17 AM

నూతన మోటర్ వెహికల్(సవరణ) యాక్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ఫైన్స్ దంచుతున్నారు. అయితే కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనడంలో కూడా ఆశ్యర్యం లేదు. సాధారణంగా హెల్మెట్‌ ఎప్పుడు పెట్టుకోవాలి? ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడేనన్నది అందరికీ తెలిసిన సంగతే. హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఆటో డ్రైవర్‌కూ బెజవాడ ట్రాఫిక్ పోలీసులు జరిమానా  వేశారు   ఏపీ16టిఎన్‌8597′.. నంబరు గల ఆటో యజమానికి ట్రాఫిక్ విభాగం పోలీసులు ఐదు చలానాలు పంపించారు. వీటికి సంబంధించిన రుసుము ఈ నెల 3న సదరు ఆటో డ్రైవర్ చెల్లించాడు. అయితే అప్పుడే హెల్మెట్ లేదని త్రీటౌన్ పోలీసులు రూ.185 జరిమానా వేసిన సంగతిని గుర్తించిన అతడు ఆశ్చర్యపోయాడు. ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని ట్రాఫిక్‌ అదనపు డీసీపీ టి.వి.నాగరాజు వివరణ ఇచ్చారు.

ఇక ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో మరోటి చోటుచేసుకుంది. బరేలీ పోలీసులు మాత్రం విచిత్రంగా కారులో వెళుతున్న ఓ వ్యక్తికి హెల్మెట్‌ లేదని రూ. 500 చలానా జారీచేశారు. షాక్‌గు గురైన వాహనదారుడు..  పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. పొరపాటుగా జరిమానా పడిందని, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెబుతున్నప్పటికీ పోలీసుల తీరు మాత్రం అందరినీ విస్మయపరుస్తోంది.