‘మహర్షి’ అసలు కథ ఇదేనట..!

మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే మహర్షి సినిమాలోని ఒక కీలకమైన ట్విస్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేంటంటే ఫస్ట్ హాఫ్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందట.. దాని తర్వాతే అమెరికాలో ఉన్న మహర్షి.. తన ఫ్రెండ్ […]

'మహర్షి' అసలు కథ ఇదేనట..!
Follow us

|

Updated on: Apr 01, 2019 | 7:10 PM

మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే మహర్షి సినిమాలోని ఒక కీలకమైన ట్విస్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేంటంటే ఫస్ట్ హాఫ్ చివర్లో అల్లరి నరేష్ పాత్ర చనిపోతుందట.. దాని తర్వాతే అమెరికాలో ఉన్న మహర్షి.. తన ఫ్రెండ్ ఎందుకు చనిపోతాడో తెలుసుకుని.. అతని లక్ష్యం నెరవేర్చడానికి పల్లెటూరు పయనమవుతాడట.

అందువల్లే అల్లరి నరేష్ కోసం హీరోయిన్ ను తీసుకోలేదని సమాచారం. ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియదు గానీ.. ఇప్పుడు మాత్రం ఈ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదే నిజమైతే సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారట. మరోవైపు మహర్షి టీజర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తారట చిత్ర యూనిట్.