బిల్డింగ్ పిట్ట గోడలపై నుంచి పిట్టల్లా రాలిపోయారు.. మొహర్రం వేళ విషాదం

One crowded parapet collapsed under the weight of the crowd injuring 20, బిల్డింగ్ పిట్ట గోడలపై నుంచి పిట్టల్లా రాలిపోయారు.. మొహర్రం వేళ విషాదం

మొహర్రం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపు, ఇతర మతపరమైన కార్యక్రమాలను చూసేందుకు వందలాదిగా ప్రజలు వీధుల్లో గుమికూడడమే కాక.. చుట్టుపక్కల గల బిల్డింగులపై కూడా ఎక్కారు. అలాగే దాదాపు శిథిలావస్థలో ఉన్న ఓ భవనం పైకి పెద్ద సంఖ్యలో స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వఛ్చిన ప్రజలు ఎక్కారు. కింద జరుగుతున్న తంతును చూసేందుకు అంతా వంగి చూస్తుండగా బరువును భరించలేక సదరు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అంతే ! చాలామంది పై నుంచి కింద పడిపోయారు. అలాగే కింద రోడ్డుపై ఉన్నవారు కూడా ఈ హఠాత్ సంఘటనతో భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం కర్నూలు జిల్లా బి. తాండ్రపాడు గ్రామంలో జరిగింది. అతి చిన్నదైన ఈ గ్రామానికి వేల సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
One crowded parapet collapsed under the weight of the crowd injuring 20, బిల్డింగ్ పిట్ట గోడలపై నుంచి పిట్టల్లా రాలిపోయారు.. మొహర్రం వేళ విషాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *