Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు…

Surprising health benefits of radish, ముల్లంగితో ఆరోగ్య ప్రయోజనాలు…

ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ… ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి.

  • తిన్న ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు… భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే… ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని… రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, అర్ష మొలలు, ప్లీహం, కామెర్ల వంటి సమస్యలు దూరమవుతాయి.
  • విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే… మూత్ర సంబంధ మంట తగ్గుతుంది. కొంతమంది ఊపిరి తిత్తుల్లో ఏదో ఉన్నట్లు మాటిమాటికీ దగ్గుతూ ఉంటారు. కారణం బ్రాంకైటిస్ అనే సమస్య. వాళ్లు ముల్లంగి జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి తాగేయాలి.
  • కొంతమంది అబ్బాయో, అమ్మాయో అర్థం కాదు. తేడాగా కనిపిస్తుంటారు. ఆ నపుంసకత్వం తొలగిపోవాలంటే ముల్లంగి గింజల్ని, ఆవు పాలలో మరిగించి… వాటిని తాగాలి. తద్వారా లైంగిక శక్తి పెరగడమే కాదు… శీఘ్రస్కలన సమస్య కూడా పోతుంది.
  • కిడ్నీ సమస్యలు బాధపడేవారు రోజుకు ఒకసారి 100ఎంఎల్ ముల్లంగి ఆకుల రసం తాగాలి. అప్పుడు హైబీపీ, శరీర వాపులకు కారణమయ్యే నెఫ్రైటీస్, కిడ్నీలకు వచ్చే డియురెటిక్ (Diuretic) సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పచ్చి రసం తాగలేని వారు తేనె కలుపుకొని తాగొచ్చు.
  • అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి… గుజ్జులా చేసి… శరీరంపై గజ్జి, పొక్కులు ఉన్న చోట రాస్తే అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి… నీళ్లలో కలిపి రాత్రి తాగితే… కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి. ముల్లంగి గింజల్ని బాగా నూరి… ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని… గంట తర్వాత నీటితో కడుక్కుంటే… ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి.

Related Tags