Breaking News
 • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
 • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
 • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
 • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
 • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
 • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
 • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

షాకింగ్ న్యూస్..మిడ‌త‌లు ఒక్కరోజులో 35వేలమంది ఆహారాన్ని లాగించేస్తున్నాయ్..

India Suffers Biggest Locust Attack in 25 Years. Here Is Some Details, షాకింగ్ న్యూస్..మిడ‌త‌లు ఒక్కరోజులో 35వేలమంది ఆహారాన్ని లాగించేస్తున్నాయ్..

ఇండియాను ఇప్పుడు కరోనాతో పాటు మిడ‌త‌లు కూడా దెబ్బ‌తీస్తున్నాయి. క‌రోనా ఇబ్బందులు పెట్ట‌ని రంగం కొద్దొ, గొప్పో ఏదైనా రంగం ఉందంటే అది వ్య‌వ‌సాయ‌మే. కానీ భార‌త్ లోని కొన్ని రాష్ట్రాల్లో మిడ‌తలు ఇప్పుడు రైతుల పాలిట రాక్ష‌సులుగా మారాయి. పంట ఏదైనయినా సంబంధం లేకుండా..పచ్చ‌గా క‌న‌ప‌డిన దాన్న‌ల్లా ఆర‌గించేస్తున్నాయి. ఒక్క‌సారే ల‌క్ష‌ల సంఖ్య‌లో పంటపై దాడిచేసి..అక్క‌డ పైరు వేశామ‌న్న ఆన‌వాలు కూడా లేకుండా చేస్తున్నాయి. అటువంటి మిడ‌త‌ల గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుసుకుందాం.

 • ప్ర‌స్తుతం ఇండియాలోని పంటపొలాలపై దండెత్తిన మిడతలు మన ఇంటి పరిసరాల్లో చూసే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే వేలు, లక్షల సంఖ్యలో ఒక్కసారిగా పంట‌పై దాడి చేస్తాయి. మిడతలు కేవలం మొక్కలను మాత్రమే ఆర‌గిస్తాయి. పొడి వాతావరణంలో ఇవి ఎక్కువ‌గా సంచారం సాగిస్తాయి.
 • చీమ త‌న‌క‌న్నా ఎక్కువ బ‌రువును మోసిన‌ట్టు..మిడ‌తా త‌న బ‌రువుక‌న్నా ఎక్కువ‌గా ఆహారం తిన‌గ‌ల‌దు. ఇవి పంటలపై గుంపుగా దాడిచేస్తే..తెల్లారే స‌రికి పైరు ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌వ్.
 • ఈ మిడ‌త‌లో ఒక రోజులో 150కి.మీ. వరకూ ఇవి ప్రయాణిస్తాయట. ఎక్కువ స‌మ‌యం గాలిలో ఎగురుతూ కూడా ఉండ‌గ‌ల‌వు. వ‌ర్షం కురిస్తే వాటి సంతోనోత్పత్తి పెరిగుతుంది.
 • కిలోమీట‌రు పరిధి గల ప్రాంతాన్ని 80మిలియన్ల మిడతలు ఆక్ర‌మించ‌గ‌ల‌వు. ఇవి 35వేలమందికి సరిపోయే ఆహారాన్ని సింగిల్ డేలో ఖ‌తం చేస్తాయి.
 • వీటి సంతానోత్పత్తి ఊహ‌కంద‌ని విధంగా ఉంటుంది. మూడు నెలల్లో ఇవి 20రెట్లు… ఆరు నెలల్లో 400 రెట్లు..9నెలల్లో 8వేల రెట్లకు ఇవి పెరిగిపోతాయి.
 • ప్రస్తుతం ఇండియాపై ఈ మిడతల జన్మస్థానం తూర్పు ఆఫ్రికా, సూడాన్., అవి అక్కడి నుంచి మొదలై సౌదీ అరేబియా, ఇరాన్‌, పాకిస్థాన్‌కు వచ్చాయి. పాక్‌ నుంచి ఇప్పుడు మ‌న‌దేశంలోకి ప్రవేశించాయి.
 • ప్రపంచంలోని ఇతర వలస కీటకాలతో పోలిస్తే, మిడతల దండు అత్యంత ప్రమాదకరమైనది. వీటి వల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని యునైటెడ్‌ నేషన్స్‌కు చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Related Tags