Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

రాహుల్‌కు మరోసారి హ్యాండిచ్చిన బీసీసీఐ!

Shock To KL Rahul, రాహుల్‌కు మరోసారి హ్యాండిచ్చిన బీసీసీఐ!
Shock To KL Rahul: పరుగుల వరద పారించినా.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా జట్టులో స్థానం సంపాదించడం కష్టమని మరోసారి ప్రూవ్ అయింది. కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. రెండు అర్ధశతకాలతో 224 పరుగులు చేసి మ్యాన్ అఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా దిగాడు.ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా అజేయంగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా జట్టు ఏ స్థానంలో దిగమంటే.. ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేసి ప్రత్యేకమైన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు.

వన్డేల్లో ధోని స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న రాహుల్.. టీ20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు అన్ని విభాగాల్లోనూ ఉపయోగపడుతున్నడు. ఇంత అద్భుతంగా రాణిస్తున్నా కూడా.. అతడికి టెస్టుల్లో అవకాశం లభించట్లేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ ఇష్యూ వల్ల కివీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంలో ఆలస్యం వహించిన బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది.

ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయంతో మిగతా సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో వన్డేలకు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయగా.. అనూహ్యంగా టెస్టులకు శుభ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో గిల్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. అటు న్యూజిలాండ్ ఏతో జరుగుతున్నా సిరీస్‌లో కూడా పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక టెస్టుల్లో రాహుల్‌ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా రాహుల్‌కు ఇలాగే షాక్ తగిలింది. టీ20ల్లో అద్భుతంగా రాణించినా కూడా టెస్టుల్లో అవకాశం లభించలేదు.

మరోవైపు రాహుల్ మాత్రం ఎప్పటికప్పుడు తన బ్యాటింగ్ టెక్నీక్‌ను మారుస్తూ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అటు కోహ్లీ కూడా వన్డేల్లో రాహుల్‌ను ఐదో స్థానంలో ప్రయత్నిస్తామని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, సాహా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, షమీ, సైనీ, ఇషాంత్ శర్మ( నో క్లారిటీ)

Related Tags