నా సపోర్ట్‌ టీమిండియాకే: షోయబ్‌ అక్తర్‌

ఐసీసీ వరల్డ్‌కప్ 2019లో భాగంగా తమ జట్టు లీగ్‌ దశలోనే ఇంటి బాట పట్టిన తరుణంలో ఇక తన మద్దతు టీమిండియాకే అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. ఈసారి వరల్డ్‌కప్‌ ఉప ఖండపు జట్టే సొంతం చేసుకోవాలనే తన కోరికని, ఆ క్రమంలోనే మెగా టోర్నీలో మిగిలి ఉన్న భారత్‌కే తాను మద్దతిస్తున్నట్లు పేర్కొన్నాడు. సాధారణంగా మేజర్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందనే విషయం గతంలో చాలా సందర్భాల్లో నిజమైందన్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో […]

నా సపోర్ట్‌ టీమిండియాకే: షోయబ్‌ అక్తర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 9:30 PM

ఐసీసీ వరల్డ్‌కప్ 2019లో భాగంగా తమ జట్టు లీగ్‌ దశలోనే ఇంటి బాట పట్టిన తరుణంలో ఇక తన మద్దతు టీమిండియాకే అంటున్నాడు పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. ఈసారి వరల్డ్‌కప్‌ ఉప ఖండపు జట్టే సొంతం చేసుకోవాలనే తన కోరికని, ఆ క్రమంలోనే మెగా టోర్నీలో మిగిలి ఉన్న భారత్‌కే తాను మద్దతిస్తున్నట్లు పేర్కొన్నాడు. సాధారణంగా మేజర్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందనే విషయం గతంలో చాలా సందర్భాల్లో నిజమైందన్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అని అక్తర్‌ స్సష్టం చేశాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్‌ శర్మపై అక్తర్‌ ప్రశంసలు కురింపించాడు. రోహిత్‌ గేమ్‌ను అర్థం చేసుకునే తీరు అమోఘమన్నాడు. మరొకవైపు కేఎల్‌ రాహుల్‌ కూడా సెంచరీతో ఆకట్టుకోవడం శుభ పరిణామమని అక్తర్‌ స్పష్టంచేశాడు.