టీమిండియా జిందాబాద్ : షోయబ్ అక్తర్

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరును భారత్ ముందు ఉంచింది. ఇది ఇలా ఉంటే కొద్దిరోజుల ముందు నుంచి ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మీ సపోర్ట్‌ ఎవరికి అని పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఒక ప్రశ్న సంధించడంతో ఇప్పుడు […]

టీమిండియా జిందాబాద్ : షోయబ్ అక్తర్
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 30, 2019 | 9:04 PM

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరును భారత్ ముందు ఉంచింది. ఇది ఇలా ఉంటే కొద్దిరోజుల ముందు నుంచి ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మీ సపోర్ట్‌ ఎవరికి అని పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌ హుస్సేన్‌ ఒక ప్రశ్న సంధించడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు పాకిస్థాన్ కూడా సెమీస్‌కు చేరాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలి. అందుకే పాక్ అభిమానులు సైతం భారత్ గెలవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

ఇక దీనికి పాక్ మాజీ ఆటగాళ్లు కూడా పూర్తి మద్దతు తెలిపారు. టీమిండియాకే సపోర్ట్ చేయాలంటూ పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆ దేశ అభిమానులను తన యూట్యూబ్‌ ఛానల్‌లో కోరాడు. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే.. పాక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెమీస్‌కు చేరుతుంది.. అందుకే మనం భారత్‌కు మద్దతు తెలుపుదాం అని అన్నాడు. అయితే ఇంగ్లండ్‌లో ఉంటున్న పాక్‌ అభిమానులు మాత్రం ఇంగ్లాండ్ జట్టుకే సపోర్ట్‌ ఇస్తారని భావిస్తున్నట్లు అక్తర్‌ పేర్కొన్నాడు. ఆ దేశపు నీరు, వారి ఆహారం తింటున్న కారణంగా అక్కడి ఉండే పాకిస్తానీలు ఆ జట్టుకు మద్దతు తెలపడం సమంజసమని సూక్తులు వల్లించాడు.