శివసేన పార్టీపై విరుచుకుపడ్డ ఒవైసీ

శివసేన పార్టీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉన్న చట్టాలు శివసేనకు అర్ధం కావని, ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్ది ఓట్ల లబ్ధికి ప్రయత్నాలు చేస్తుండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసుదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేపట్నించి టోపీ పెట్టుకోకూడదు, గడ్డం పెంచుకోకూడదు అని కూడా అంటారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇది […]

శివసేన పార్టీపై విరుచుకుపడ్డ ఒవైసీ
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 6:24 PM

శివసేన పార్టీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉన్న చట్టాలు శివసేనకు అర్ధం కావని, ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, హిందుత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్ది ఓట్ల లబ్ధికి ప్రయత్నాలు చేస్తుండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఎంఐఎం అధ్యక్షుడు అసుదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేపట్నించి టోపీ పెట్టుకోకూడదు, గడ్డం పెంచుకోకూడదు అని కూడా అంటారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇది నిశ్చయంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనంటూ పలు విపక్షాల నేతల నుంచి కూడా విమర్శలు రావడంతో శివసేన వెనక్తి తగ్గింది. ‘సామ్నా’ సంపాదకీయం ఎంతమాత్రం పార్టీ అధికార నిర్ణయం కాదంటూ శివసేన ప్రతినిధి నీలమ్ గార్హె వివరణ ఇచ్చారు.