నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివసేన ఫైర్

దేశ ఆర్ధిక వ్యవస్థపైన, వాణిజ్య, వ్యవసాయ రంగాలపైన  మోదీ ప్రభుత్వం పాటిస్తున్న విధానాలపై శివసేన శనివారం శివమెత్తింది.  దేశంలోని విమానాశ్రయాలు, ఎయిరిండియా, రేల్వేల ప్రైవేటీకరణ దిశగా..

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివసేన ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2020 | 5:29 PM

దేశ ఆర్ధిక వ్యవస్థపైన, వాణిజ్య, వ్యవసాయ రంగాలపైన  మోదీ ప్రభుత్వం పాటిస్తున్న విధానాలపై శివసేన శనివారం శివమెత్తింది.  దేశంలోని విమానాశ్రయాలు, ఎయిరిండియా, రేల్వేల ప్రైవేటీకరణ దిశగా ఈ ప్రభుత్వం సాగుతోందని, రైతుల బతుకులను ట్రేడర్లు, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో దుయ్యబట్టింది. కీలకమైన అంశాలపై ఈ ప్రభుత్వం తన మిత్రపక్షాలతో గానీ, విపక్షాలతో గానీ, రైతు సంఘాలతో గానీ సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వ్యవసాయంపై రెండు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని సేన పేర్కొంది. శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన విషయాన్ని శివసేన ప్రస్తావిస్తూ.. మోదీ సర్కార్ రైతు వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆమె రాజీనామా చేశారని తెలిపింది.

ఎన్డీయే నుంచి మేం ఇదివరకే వైదొలిగాం.. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ వంతు వచ్చింది. లోగడ వాజ్ పేయి, అద్వానీల హయాంలో వారు ఈ విధమైన కీలకాంశాలపై అన్ని ప్రతిపక్షాలనూ సంప్రదించేవారని . విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేవారని  మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన గుర్తు చేసింది. 

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!