”ముఖ్యమంత్రి గారి పెళ్ళాం దొరికిపోయింది..” వైరల్ న్యూస్!

”దొంగ బంగారంతో పట్టుబడ్డ ముఖ్యమంత్రి భార్య”.. ఇప్పుడీ వార్త మధ్యప్రదేశ్ రాష్ట్రాన్నీ, బీజేపీని తెగ ఇరకాటంలో పెట్టేస్తోంది. ”భోపాల్ లోని క్రిష్ణానగర్ ప్రాంతంలో ఉంటున్న సాధ్నా సింగ్.. 5 కిలోల దొంగ బంగారం తరలిస్తూ దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది.. ఇప్పుడామె అక్కడి కస్టమ్స్ అధికారుల అదుపులో వుంది. నేరం రుజువైతే ఆమెకు అక్కడే జైలు ఖాయం” అంటూ ఒక వైరల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భార్య […]

''ముఖ్యమంత్రి గారి పెళ్ళాం దొరికిపోయింది..'' వైరల్ న్యూస్!
Follow us

|

Updated on: May 13, 2019 | 9:09 PM

”దొంగ బంగారంతో పట్టుబడ్డ ముఖ్యమంత్రి భార్య”.. ఇప్పుడీ వార్త మధ్యప్రదేశ్ రాష్ట్రాన్నీ, బీజేపీని తెగ ఇరకాటంలో పెట్టేస్తోంది. ”భోపాల్ లోని క్రిష్ణానగర్ ప్రాంతంలో ఉంటున్న సాధ్నా సింగ్.. 5 కిలోల దొంగ బంగారం తరలిస్తూ దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది.. ఇప్పుడామె అక్కడి కస్టమ్స్ అధికారుల అదుపులో వుంది. నేరం రుజువైతే ఆమెకు అక్కడే జైలు ఖాయం” అంటూ ఒక వైరల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భార్య పేరు కూడా సాధ్నా సింగ్ కావడంతో.. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇదొక అందివచ్చిన అవకాశంగా మారి.. ఇంకా పనిగట్టుకుని వైరల్ చేయడం మొదలుపెట్టారు.

‘మై భీ చౌకీదార్’ అంటూ పొలిటికల్ స్లోగన్ పెట్టుకుని స్వచ్ఛమైన నాయకులమంటూ ఊరేగుతున్న కమలనాధుల్ని ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం వేసిన ఎత్తుగడల్లో ఇదీ ఒకటి. కాపలాదారులే దొంగలయ్యారు.. దొంగలే దొంగ దొంగ అంటూ అరుస్తున్నారు.. బీజేపీ అంటేనే ఒక దొంగల పార్టీ అంటూ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం భార్య ‘ఉదంతాన్ని’ తమ ప్రాపగాండాకు ప్రధాన వస్తువుగా మార్చుకున్నారు. దుబాయ్ కస్టమ్స్ వారి లెటర్ హెడ్ తో కూడిన ఒక లేఖను కూడా ఎటాచ్ చేశారు.

కానీ.. ఈ వార్తలో వాస్తవం లేదని తేల్చేసింది నేషనల్ మీడియాకు చెందిన ఒక వెబ్ సైట్. దుబాయ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన వివరాల్ని సేకరించి.. ఇది ఫేక్ న్యూస్ అంటూ విడమర్చి చెప్పేసింది. సేధ్నా సింగ్ అనే పేరును సాధ్నా సింగ్ గా మార్చి.. ఆ లెటర్ హెడ్ ని మానిప్యులేట్ చేసి.. సోషల్ మీడియాలో ఈవిధంగా వాడుకున్నట్లు తెలిసిపోయింది. ”ముఖ్యమంత్రి భార్య దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోలేదు.. అదంతా పచ్చి అబద్ధం” అంటూ రివర్స్ క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అగత్యం పట్టింది మధ్యప్రదేశ్ బీజేపీయులకు. ఇదీ సంగతి.