పాక్‌ ఇంతకంటే ఏం చేయగలదు:  శివసేన

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావాలని పాక్‌ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌ కంటే ఆ దేశానికే అధిక నష్టమని శివసేన అభిప్రాయపడింది. ఈ విషయంలో పాక్‌కు కృతజ్ఞతలు తెలపాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో శుక్రవారం సంపాదకీయం ప్రచురించింది. పాక్‌ ఇంతకంటే ఏం చేయగలదని అందులో ప్రశ్నించింది. పాక్‌కు కశ్మీర్‌ అంశం ముగిసిన అంశమని ఇకనైనా అంగీకరించాలంది. పీవోకేపై వివాదాన్ని సైతం త్వరలో పరిష్కరిస్తామని హెచ్చరించింది. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ […]

పాక్‌ ఇంతకంటే ఏం చేయగలదు:  శివసేన
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 2:03 AM

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావాలని పాక్‌ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌ కంటే ఆ దేశానికే అధిక నష్టమని శివసేన అభిప్రాయపడింది. ఈ విషయంలో పాక్‌కు కృతజ్ఞతలు తెలపాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో శుక్రవారం సంపాదకీయం ప్రచురించింది. పాక్‌ ఇంతకంటే ఏం చేయగలదని అందులో ప్రశ్నించింది. పాక్‌కు కశ్మీర్‌ అంశం ముగిసిన అంశమని ఇకనైనా అంగీకరించాలంది. పీవోకేపై వివాదాన్ని సైతం త్వరలో పరిష్కరిస్తామని హెచ్చరించింది. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అఖండ భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా పాక్‌లో బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. తమ పార్టీ పాక్‌లో సైతం ప్రవేశించిందని రాసుకొచ్చింది.

గత కొంత కాలంగా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ని సైతం మూసివేయాలని శివసేన డిమాండ్‌ చేస్తోందని.. కశ్మీర్‌ వేర్పాటువాదులకు నిధులు అక్కడి నుంచే సమకూరుతున్నాయని సంపాదకీయంలో రాసుకొచ్చింది. ఇరు దేశాల మధ్య ఇక ఏమాత్రం భావోద్వేగ బంధాలు లేవని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు పట్ల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందిస్తూ.. ఇలాంటి చర్యల వల్ల పుల్వామా లాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన స్పందిస్తూ.. పుల్వామా దాడి వెనక పాక్‌ ప్రభుత్వ హస్తం ఉంది అనడానికి ఇమ్రాన్‌ వ్యాఖ్యలే నిదర్శమని దుయ్యబట్టింది.