Breaking News
  • పరువు హత్య కేసులో పోలీసుల అలసత్వం. 100 కి ఫోన్ చేసినా పట్టించుకోని గచ్చిబొలి పోలీసులు. అవంతి, హేమంత్ లను నిన్న గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసిన అవంతి తండ్రి పంపిన సుపారి గ్యాంగ్. కారు లో నుంచి దూకి పారిపోయి 100కి సమాచారం ఇచ్చిన అవంతి. సకాలంలో స్పందించని గచ్చిబౌలి పోలీసులు. ఆలస్యం చేయడం తో హేమంత్ ని సంగారెడ్డి తీసుకుని వెళ్లి హత్యచేసిన సుపారి గ్యాంగ్. రాత్రి కి తేరుకొని విచారన జరిపి అవంతి తండ్రి ఇచ్చిన సమాచారం తో సంగారెడ్డి లో మృతదేహాన్నీ గుర్తించిన పోలీసులు. ప్రస్తుతంఉస్మానియా మార్చురీ లో హేమంత్ మృతదేహం.
  • మంచు లక్ష్మి ట్వీట్‌ :బాలు కోలుకోవాలని మంచు లక్ష్మి ట్వీట్‌ .మా అందరి కోసం ఈ కష్టాన్ని అధిగమించడానికి పోరాడండి అని ట్వీట్.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ఉద్వేగభరిత వాతావరణం. ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్. చికిత్సకు బాలసుబ్రమణ్యం స్పందించడం లేదంటున్న ఆసుపత్రికి వర్గాలు. మరింత విషమంగా ఆరోగ్యం. ఆయనకు చికిత్స అందిస్తున్న ఆరుగురు వైద్యుల బృందం. మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారంటున్న ఆసుపత్రి వర్గాలు. కరోనా కారణంగా ఆసుపత్రి వద్దకు ఎవరూ రావొద్దని సూచిస్తున్న ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి దగ్గరకు వచ్చి బాలు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని వెళ్లిపోతున్న అభిమానులు. ఎంజీఎం ఆసుపత్రికి వెల్లువెత్తుతున్న ఫోన్లు. బాలు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రముఖులు, అభిమానుల ఫోన్లు. మరికాసేపట్లో ఆసుపత్రికి రానున్న దర్శకుడు భారతీరాజా.
  • కడపజిల్లా :వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేస్ లో విచారణ. కడప సెంట్రల్ జైల్ కేంద్రం గా కొనసాగుతున్న సీబీఐ విచారణ. ఈ రోజు మరో సారి చెప్పుల షాప్ యజమాని మున్నా ని ప్రశ్నించనున్న సీబీఐ. నిన్న సుదీర్ఘంగా మున్నాని 8 గంటల పైగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు. మున్నా తో పాటు పులివేందులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య ,నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులు లను ప్రశ్నించిన సీబీఐ. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న సీబీఐ. నిన్న మొత్తం 8 మంది ని విచారించిన సిబిఐ అధికారులు. చెప్పుల షాప్ యజమాని మున్నా స్నేహితులను కూడా పులివెందుల లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు. పులివెందుల కి చెందిన రియల్ ఎస్టేట్ పుల్లయ్య ని దాదాపు 7 గంటల పైగా ప్రశ్నించిన సీబీఐ. మున్నా అనే వ్యక్తి పుల్లయ్య కి ఎలా పరిచయం,ఎన్ని రోజులు గా పరిచయం అనే కోణం లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య ని సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. పుల్లయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న సీబీఐ.
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీరియస్. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం. ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు.
  • విశాఖ : విశాఖ నుండి ఒరిస్సాకు నేటి నుండి పునః ప్రారంభమైన RTC బస్సులు . విశాఖ నుండి గుణుపూర్, నవరంగపూర్, ఒనకడిల్లీ, పర్లాఖెముండి, ధవన్ జోడీ, జైపూర్ ప్రాంతాలకు నడవనున్న బస్ లు.

సాయిబాబా జన్మస్థలంపై వివాదం.. ఆందోళనలో భక్తులు.. మరి షిర్డీ ట్రస్ట్ నిర్ణయమేంటి.?

Saibaba Birth Place Issue, సాయిబాబా జన్మస్థలంపై వివాదం.. ఆందోళనలో భక్తులు.. మరి షిర్డీ ట్రస్ట్ నిర్ణయమేంటి.?

కులమతాలకు అతీతంగా అందరూ పూజించే కలియుగ దైవం సాయిబాబా. ఆయన పేరు స్మరించిన వెంటనే గుర్తొచ్చేది షిర్డీ. ఎప్పటి నుంచో షిరిడీలో సాయిబాబా ఆలయం ఉంది. దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు ఆలయాన్ని ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ జన్మించారన్నది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ. కొంతమంది మాత్రం మహారాష్ట్ర పర్బణి జిల్లాలోని పాథ్రీలో 1854వ సంవత్సరంలో ఓ వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా బాబా మొదటిసారి స్థానికులకు కనిపించారని చెప్పుకుంటారు. ఇక అలాగే 1918 అక్టోబర్ 15న బూటీవాడలో సమాధి అయ్యారని కూడా ప్రచారం ఉంది. అంతేకాకుండా బాబా దేవుడా.. లేక మనిషా అన్న భిన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలో అధికారం చేపట్టిన శివసేన ప్రభుత్వం సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీని అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయించడంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే షిర్డీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని సంస్థాన్ ట్రస్ట్ వాదిస్తుండగా.. చుట్టు ప్రక్కల గ్రామ సర్పంచులు మాత్రం ఆలయాన్ని మూసివేస్తే సర్కార్ తలొగ్గుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం స్థానికులతో ఈ వివాదంపై చర్చలు జరిపి తదుపరి కార్యాచరణ గురించి చెబుతామని సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.

ఇకపోతే బాబా జన్మస్థలం పాథ్రీనేనని.. అది నిరూపించడానికి ఆధారాలు కూడా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లాఖాన్ స్పష్టం చేశారు. షిర్డీ ‘కర్మభూమి’ అయితే.. పాథ్రీ ‘జన్మభూమి’ అని అన్నారు. దీన్ని అప్పటి గవర్నర్  రామ్‌నాధ్ కోవింద్ కూడా సమ్మతించారన్నారు. ఈ రెండు ప్రదేశాలూ దేనికవే గొప్పవన్నారు.

మరోవైపు సాయిబాబా తన 16వ ఏటా షిర్డీకి వచ్చారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి షిర్డీలోనే ఉంటూ ప్రజల కష్టాలను తీర్చారని.. ఆ తర్వాత అంతర్ధానం అయ్యారని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఇక 1999లోనే బాబా జన్మస్థలం పాథ్రీలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానిక ప్రజలు నిర్మించడం జరిగింది.  అటు షిర్డీలో కూడా ఎప్పటినుంచో ఆలయం ఉంది. నాడు తలెత్తని వివాదం నేడు ఎందుకు తెరపైకి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా, బీజేపీ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వివాదం రాజుకుందని.. ఆలయాన్ని షిర్డీ నుంచి తరలించడానికి యోచిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇటు శివసేన మంత్రులు మాత్రం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Related Tags