Breaking News
  • హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో లో సహాయక చర్యల నిమిత్తం తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ ల నిర్ణయం దీంతోపాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్న కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఈ మేరకు ఒక లేఖ ని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు కి అందించారు.
  • తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు.
  • అమరావతి: విశాఖ కాపులుప్పుడులో ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. విశాఖ కాపులపాడు లో 20 ఎకరాలు పేదలకు ఇళ్ళు స్థలలుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు. ఇదంతా బౌద్ధిని స్తూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొత్తపల్లి వెంకట రమణ. ప్రభుత్వం పురావస్తు చట్టం మరియు పర్యావరణ చట్టం లోని నిబంధనలు కీ వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారన్న పిటిషనర్. దీనిపై విచారణ జరిపి స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.
  • మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జలమండలి సంప్ లు శుభ్రపర్చలని నిర్ణయం. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు. మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ చేయనున్న జలమండలి. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంప్‌ వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని ప్రకటన. జలమండలి సరఫరా నీటితో నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడాలని సూచన. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటితో కలపడానికి క్లోరిన్ మాత్రలను పంపిణీ చేస్తోంది. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ 155313 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
  • కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా తిరిగి ఫిట్‌ నెస్‌ మీద దృష్టి పెట్టారు. ముంబైలోని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న ఈ బ్యూటీ వర్క్‌ అవుట్స్ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత వ్యాయామం తప్పని సరి అంటూ తన వర్క్ అవుట్‌ వీడియోను షేర్ చేశారు ఈ బ్యూటీ.
  • పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించిన మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఈ కింది రాయితీ వర్తింపు . మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ . స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం . 20 ట్రిప్పుల చార్జీతో ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం . 40 ట్రిప్పుల చార్జీతో ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం . టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు . 7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం. 14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం . 20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం . 30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం . 40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం.

కోహ్లీ, రోహిత్‌లను దాటేసిన గబ్బర్.. ఐపీఎల్‌లో రేర్ ఫీట్.!

భారత జట్టు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(39) సాధించిన రెండో ఆటగాడిగా..

IPL 2020, కోహ్లీ, రోహిత్‌లను దాటేసిన గబ్బర్.. ఐపీఎల్‌లో రేర్ ఫీట్.!

భారత జట్టు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(39) సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి గబ్బర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు 38 అర్ధ సెంచరీలతో మూడో స్థానంలో ఉండగా.. ధావన్‌ది రెండో స్థానం. (IPL 2020)

ఈ జాబితాలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(46 హాఫ్ సెంచరీలతో) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 167 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 33.59 సగటుతో 4,837 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న గబ్బర్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Related Tags