ఆఖరి మజిలీలోనూ ‘షీలా’ మార్క్..అంత్యక్రియల ఖర్చు రూ. 500

ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబోధ్‌ ఘాట్‌లో జరిగాయి. అంతిమ మజిలీలో కూడా ఆమె తన మార్క్‌ను చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి అంత్యక్రియల ఖర్చు రూ. 500 అంటే మీరు నమ్ముతారా?. ప్రకృతి ప్రేమికురాలైన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలలో కూడా ఆదర్శంగా నిలిచారు. కట్టెల్లో కాకుండా గ్యాస్‌ వినియోగించి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.  షీలా దీక్షిత్ ఎలాంటి మూఢనమ్మకాలను పెట్టుకోకుండా తనకు గ్యాస్ విధానంలోనే […]

ఆఖరి మజిలీలోనూ 'షీలా' మార్క్..అంత్యక్రియల ఖర్చు రూ. 500
Follow us

|

Updated on: Jul 22, 2019 | 2:19 PM

ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబోధ్‌ ఘాట్‌లో జరిగాయి. అంతిమ మజిలీలో కూడా ఆమె తన మార్క్‌ను చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి అంత్యక్రియల ఖర్చు రూ. 500 అంటే మీరు నమ్ముతారా?. ప్రకృతి ప్రేమికురాలైన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలలో కూడా ఆదర్శంగా నిలిచారు. కట్టెల్లో కాకుండా గ్యాస్‌ వినియోగించి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.  షీలా దీక్షిత్ ఎలాంటి మూఢనమ్మకాలను పెట్టుకోకుండా తనకు గ్యాస్ విధానంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని బతికి ఉన్నప్పుడు కోరుకున్నారట. అందుకు తగ్గట్టే ఆమె కుటుంబసభ్యులు నడుచుకున్నారు. ఈ గ్యాస్ విధానంలో దహన సంస్కారాలు ప్రక్రియను షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. ఢిల్లీలో కాలుష్యం ఏస్థాయిలో పెరిగిపోతుందో తెలిసిందే. అందుకే ఆవిడ గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు

సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) పద్ధతిలో షీలా అంత్యక్రియలు జరిగాయి. ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు. ఇదే విధానంలో జరిగిన షీలా అంత్యక్రియల ఖర్చు అక్షరాల రూ.500. సాధారణంగా కట్టెలు ఉపయోగించి దహనం చేసినట్లయితే రూ.1,000 ఖర్చవుతుంది. అదికూడా మృతదేహం పూర్తిగా కాలడానికి 10-12 గంటల సమయం పడుతుంది. కానీ, సీఎన్జీ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తే మృతదేహం గంటలో కాలిపోతుంది. అయితే షీలా అంత్యక్రియలు సాదాసీదాగా చేయడాన్ని పలువురు వ్యతిరేకించారు.