Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

బిగ్ బాస్‌లో ప్రేమ జంట.. నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ షురూ!

Bigg Boss 13 Latest Episode Updates, బిగ్ బాస్‌లో ప్రేమ జంట.. నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ షురూ!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడూ కంటెస్టెంట్ల మధ్య గొడవలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే ఈ షోలో.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌ల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.వీరిద్దరిని కూల్ చేయడానికి మిగతా హౌస్‌మేట్స్ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా ఒకరి గతం మరొకరు తవ్వుకుని మరీ తీవ్రమైన పదజాలంతో తిట్టుకున్నారు. ఏది ఏమైనా కొంత సమయం తర్వాత సిట్యువేషన్ కంట్రోల్‌లోకి వచ్చింది.

ఈ తరుణంలో సిద్ధార్థ్‌ను అమితంగా ఇష్టపడే షెహనాజ్ గిల్.. మరో కంటెస్టెంట్ దేవోలీనాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లు ఇద్దరూ కొట్టుకోవడం తనకు నచ్చలేదన్న షెహనాజ్.. తాను ఎవరి టీమ్‌లోనూ లేనని.. కేవలం సరైన వ్యక్తికి మాత్రమే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పింది. అంతేకాకుండా సిద్ధార్థ్ పట్ల తనకున్న అభిమానాన్ని హౌస్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలియజేస్తానని చెప్పుకొచ్చింది.

ఇక షెహనాజ్ ప్రేమ విషయాన్ని సిద్ధార్థ్‌కు చెబుతున్న ఆర్తీ సింగ్.. బిగ్ బాస్ అనంతరం ఇద్దరూ కలిసి పంజాబ్‌లో సెటిల్ అవ్వాలంటూ సూచనలు ఇస్తుంది. ఇక ఈ సీన్ మొత్తం చూసిన షెహనాజ్.. ఆర్తీ, సిద్ధార్థ్‌తో బెడ్ షేర్ చేసుకోవడం నచ్చక బుంగ మూతి పెట్టుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత సిద్ధార్థ్ షెహనాజ్‌తో ఎప్పటిలానే క్యూట్ క్యూట్ సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడి ఆమె కోపాన్ని తగ్గిస్తాడు. ఇలా ఈ ప్రేమ జంట ఇద్దరూ కూడా ఫ్యాన్స్‌కు తమ రొమాన్స్‌తో కాస్త రిలీఫ్ ఇస్తున్నారు.