Breaking News
  • ఢిల్లీ: గడచిన 24 గంటలలో60,963 కరోనా పాజిటివ్ కేస్ లు,834 మంది మృతి. భారత్ లో కరోనా కల్లోలం. 23లక్షల 29 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 23,29,639 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 6,43,948. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 16,39,600 . దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 46,091.
  • నిమ్స్ లో లాంఛనంగా ప్రారంభమైన బూస్టర్ డోసేజ్ . క్లినికల్ ట్రయల్స్ లో మొదటి దశ-రెండో దశకు మధ్యలో వాలంటీర్లకు బూస్టర్ డోసేజ్. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన వైద్య బృందం. నిన్న 11 మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం. నేడు మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్న నిమ్స్ వైద్య బృందం.
  • బులియన్ మార్కెట్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. రూ.1,317 తగ్గిన బంగారం ధర. ఏకంగా రూ. 2,900కు పైగా తగ్గిన వెండి ధర. రూపాయి బలపడటమే కారణమన్న నిపుణులు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రి మండలి సమావేశం. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి సమన్వయం లో మొదలైన సమావేశం. హాజరయిన మంత్రులు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

స్టాండప్ కమెడియన్‌గా శశిథరూర్‌..పంచ్‌లు వేస్తోన్న నెటిజన్స్

Shashi Tharoor takes to stand-up comedy, స్టాండప్ కమెడియన్‌గా శశిథరూర్‌..పంచ్‌లు వేస్తోన్న నెటిజన్స్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ త్వరలోనే కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. రాజకియాల్లో సీనియర్ నేతగా, రచయితగా, ఇంగ్లీష్ భాషపై అసమాన్య పట్టున్న వ్యక్తిగా పేరున్న ఆయన త్వరలోనే యాక్టర్‌గా దర్శనమివ్వబోతున్నారు. అది కూడా స్టాండప్ కామెడీ చెయ్యబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజయ్యి..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.  ‘వన్‌ మైక్‌ స్టాండ్‌’ పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ నవంబర్ 15న అందుబాటులోకి రానుంది.

కాగా గతంలోనూ శశి థరూర్‌.. నెట్‌ఫ్లిక్స్ వారు తీసిన ‘పేట్రియాట్ యాక్ట్‌’ లోనూ కనిపించారు. మంచి వ్యాఖ్యాతగా పేరున్న శశిథరూర్‌కి ఈ రోల్ పెద్దగా ఛాలెంజింగ్‌గా అనిపించకపోవచ్చు. మాములుగానే ఆయన స్పీచ్‌లలో కంటెంట్‌తో పాటు కాస్త కామెడీ టచ్ కూడా ఉంటుంది. కాగా శశిథరూర్ కామెడీని అర్థం చేసుకోవాలటే ముందుగా..డిక్షనరీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా ఈ షోలో 5గురు సెలబ్రిటీలు..మరో ఐదుగురు ప్రొఫెషనల్ యాక్టర్స్‌తో పోటీపడనున్నారు.

 

 

Related Tags