శర్వాతో కుదిరిందా..?

Sharwanand, శర్వాతో కుదిరిందా..?

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్‌‌లో ‘రణరంగం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 2న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా శర్వానంద్ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘శమంతకమణి’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య‌తో శర్వానంద్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *