తగ్గిన దిగుమతులు.. కొండెక్కిన ధరలు..  

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. నిజానికి లాక్‌డౌన్

తగ్గిన దిగుమతులు.. కొండెక్కిన ధరలు..  
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 5:42 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలోనే ధరలు అందరికీ అందుబాటులో  ఉన్నాయి, కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కరోనా విజృంభిస్తున్ననేపధ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. అలాగే తెలంగాణలోనూ కూరగాయల దిగుబడులు తగ్గాయి. ఎక్కువమంది రైతులు నియంత్రిత సాగుపై దృష్టి కేంద్రీకరించారు.

తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూరగాయల సాగు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గిపోవడం, తెలంగాణలో పంట తగ్గడం వల్ల ప్రస్త్తుతం హైదరాబాద్‌ నగరానికి కూరగాయల దిగుమతులు 50శాతానికి పైగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

కరోనా సంక్షోభ సమయంలోనూ కిలో 10 రూపాయలకు అమ్మిన టమాటా ప్రస్తుతం కిలో 60 రూపాయలు పలుకుతోంది. కర్నాటక నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే క్యాప్సికం ప్రస్తుతం కిలో 60 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. బీర్నిస్ కూడా ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయలకు చేరింది. ఇక పచ్చి మిర్చి ధరలు కూడా రెండు వారాల క్రితం 40 రూపాయలు కిలో ఉండగా ప్రస్తుతం 60 రూపాయలకు చేరింది.