ఉరకలెత్తిన దలాల్ స్ట్రీట్..

దేశీయ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. వారం ప్రారంభంలో ఉదయం ఎంత జోష్‌గా ప్రారంభమయ్యాయో.. మార్కెట్ క్లోజింగ్ వరకు అంతే జోష్‌ను చూపించాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ 1075 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 11,603 పాయింట్లకు చేరింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు.. కార్పోరేట్ ట్యాక్స్‌ తగ్గింపు, జీఎస్టీ రేట్ల కటింగ్‌ అంశాలు మార్కెట్లు లాభాల్లో పరుగెత్తడానికి అనుకూలంగా మారాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను […]

ఉరకలెత్తిన దలాల్ స్ట్రీట్..
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 5:32 PM

దేశీయ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. వారం ప్రారంభంలో ఉదయం ఎంత జోష్‌గా ప్రారంభమయ్యాయో.. మార్కెట్ క్లోజింగ్ వరకు అంతే జోష్‌ను చూపించాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ 1075 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 11,603 పాయింట్లకు చేరింది.

ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు.. కార్పోరేట్ ట్యాక్స్‌ తగ్గింపు, జీఎస్టీ రేట్ల కటింగ్‌ అంశాలు మార్కెట్లు లాభాల్లో పరుగెత్తడానికి అనుకూలంగా మారాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఓ దశలో 1500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ కొనసాగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.94గా కొనసాగుతోంది. ఎల్‌ అండ్ టీ, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎంలు 8 శాతం లాభాల్లో ముగియగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు నష్టాలను చవిచూశాయి.

కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కేవలం రెండు రోజుల్లోనే 3000 పాయింట్ల వరకు ఎగబాకింది. శుక్రవారం 1900 పాయింట్లతో లాభపడగా.. సోమవారం 1075 పాయింట్లను లాభపడింది.