‘ మహా సంక్షోభం తేలేనా ‘ ? సోనియాతో భేటీ కానున్న శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇటు ముంబై-అటు ఢిల్లీ మధ్య ‘ పరిణామాల లింక్ ‘ కొనసాగుతోంది. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వీరు తుది రూపునిచ్ఛే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఎన్సీపీ, శివసేన దాదాపు ఏకాభిప్రాయానికి వచ్ఛేశాయి. హిందుత్వ నినాదాన్ని ‘ వదులుకునేందుకు’ శివసేన […]

' మహా సంక్షోభం తేలేనా ' ? సోనియాతో భేటీ కానున్న శరద్ పవార్
Follow us

|

Updated on: Nov 18, 2019 | 1:36 PM

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇటు ముంబై-అటు ఢిల్లీ మధ్య ‘ పరిణామాల లింక్ ‘ కొనసాగుతోంది. ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వీరు తుది రూపునిచ్ఛే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఎన్సీపీ, శివసేన దాదాపు ఏకాభిప్రాయానికి వచ్ఛేశాయి. హిందుత్వ నినాదాన్ని ‘ వదులుకునేందుకు’ శివసేన సిధ్ధపడినట్టే.. పవార్, సోనియా సమావేశానికి సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే సైతం హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు-కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, కె.సి. వేణుగోపాల్ కూడా శరద్ పవార్ తో భేటీ అయి.. కనీస ఉమ్మడి కార్యక్రమంపై..ముఖ్యంగా మహారాష్ట్రలో రైతుల దుస్థితిపై ఓ కార్యాచరణ ప్రణాళికగురించి చర్చించవచ్చునని భావిస్తున్నారు. ఇలా ఉండగా.. డిసెంబరు మొదటివారంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. సేన ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగడం ఖాయమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తమకేమీ అంటరాని పార్టీ కాదన్నారు.