ఆ మంత్రిపై రేప్ ఆరోపణలు తీవ్రమైనవి, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎన్సీపీ నేత శరద్ పవార్

తమ రాష్ట్రంలో ధనుంజయ్ ముండే అనే మంత్రిపై వచ్చిన రేప్ ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 6:42 pm, Thu, 14 January 21
ఆ మంత్రిపై రేప్ ఆరోపణలు తీవ్రమైనవి, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, ఎన్సీపీ నేత శరద్ పవార్

తమ రాష్ట్రంలో ధనుంజయ్ ముండే అనే మంత్రిపై వచ్చిన రేప్ ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. ఈ మంత్రి వ్యవహారాన్ని పార్టీలో చర్చించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు ఆషామాషీ కాదన్నారు. తనను ముండే నిన్న కలిశారని, తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ సోదరితో తనకు రిలేషన్ షిప్ ఉందన్న విషయాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు. అయితే ఈ మహిళ దీన్ని అడ్డుపెట్టుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ముండే చెప్పాడని పవార్ పేర్కొన్నారు. ఏమైనా…. ఇతడు రాజీనామా చేయాలా, అవసరం లేదా అన్న అంశాన్ని పార్టీ సహచరులతో చర్చిస్తామన్నారు.

ఈ మంత్రిగారు లోగడ బీజేపీలో కొంతకాలం ఉండి ఆ తరువాత ఎన్సీపీలో చేరాడు. ఇక తన రాజీనామా విషయమై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని ముండే అంటున్నారు.