అజిత్ పవార్ సంచలన ట్వీట్..ఎన్సీపీలోనే ఉంటా..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన ట్వీట్ చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, తమ అధినేత ఎప్పటికీ శరద్ పవారే అని  స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్సీపీ కూటమి ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా సవ్యంగానే ఉందని తెలిపారు. సహనంతో వెయిట్ చేయాల్సిందిగా ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. I am in […]

అజిత్ పవార్ సంచలన ట్వీట్..ఎన్సీపీలోనే ఉంటా..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 24, 2019 | 5:40 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన ట్వీట్ చేశారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని, తమ అధినేత ఎప్పటికీ శరద్ పవారే అని  స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్సీపీ కూటమి ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా సవ్యంగానే ఉందని తెలిపారు. సహనంతో వెయిట్ చేయాల్సిందిగా ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

ఇక అంతకుముందే.. అజిత్ పవార్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అలాగే 20 మంది బీజేపీ నేతలకూ ధన్యవాదాలు తెలిపారు. ‘ గౌరవనీయులైన ప్రధాని మోదీ గారికి… మేం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడేలా చూస్తాం.. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాం.. ‘ అని ఆయన పేర్కొన్నారు. పైగా ట్విట్టర్లో తన నూతన పొలిటికల్ రోల్ గురించి ప్రస్తావించారు. అందులో ‘ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ‘ అని తన ‘ బయో ‘ ను మార్చారు. మోదీని ఉద్దేశించి ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన.. బీజేపీ చీఫ్, హోం మంత్రి అమిత్ షా కు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తో బాటు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్ లకు, అలాగే మరికొంతమంది బీజేపీ మంత్రులు, నేతలకు కూడా అజిత్ పవార్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీటించారు.