ఉల్లి ఎగుమతుల నిషేధంపై పునరాలోచన మేలు, శరద్ పవార్

ఉల్లి ఎగుమతులను తక్షణం నిషేధించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ కోరారు. తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో ఈ విషయమై మాట్లాడానని, తాజా చర్యపై తిరిగి సమీక్షించాలని కోరానని..

  • Umakanth Rao
  • Publish Date - 3:29 pm, Tue, 15 September 20

ఉల్లి ఎగుమతులను తక్షణం నిషేధించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ కోరారు. తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో ఈ విషయమై మాట్లాడానని, తాజా చర్యపై తిరిగి సమీక్షించాలని కోరానని ఆయన చెప్పారు. ఈ నిషేధం వల్ల పాకిస్థాన్ వంటి దేశాలే లాభపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఉల్లి ఎగుమతిదారుగా ఇండియాకు మంచి పేరు ఉందని, ఇప్పుడీ నిర్ణయం దాన్ని దెబ్బ తీస్తుందని హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.  వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉల్లి రైతులకు చేటు తెస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో ఉల్లి కేజీ 40 రూపాయల నుంచి 45, 50 రూపాయల వరకు పెరిగిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా వచ్ఛే నవంబరు వరకు దేశంలో ఉల్లికి సంబంధించి ఈ పరిస్థితి కొనసాగవచ్చునని భావిస్తున్నారు.