షాకింగ్: ‘సాహో’ నుంచి వాళ్లు ఔట్

Shankar Ehsaan Loy, షాకింగ్: ‘సాహో’ నుంచి వాళ్లు ఔట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సాహో షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆగష్టు 15న ఈ సినిమాకు విడుదల తేదిని కూడా ఫిక్స్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు సంగీత దర్శకులు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందించనున్నట్లు మొదట్లోనే ప్రకటించగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తాము తప్పుకున్నట్లు శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్‌ను తెలిపారు శంకర్ మహదేవన్. దీంతో ఇటు ఫ్యాన్స్‌తో పాటు అటు సాధారణ ప్రేక్షకులకు షాక్ తగిలినట్లైంది. కాగా వీరు తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత దర్శకుడు థమన్ రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో ఆ మధ్యన విడుదలైన వీడియోలకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ అందించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *