బిగ్ బ్రేకింగ్: షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ నిషేధం

ప్రపంచ క్రికెట్‌లో ఏస్ ప్లేయర్‌గా రాణిస్తోన్న బంగ్లాదేశ్ ఆటగాడు, ఆ దేశ టీ20, టెస్ట్ జట్ల కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ నిషేదం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఆడకుండా రెండేళ్లు ఈ  నిషేధం వర్తిస్తుంది.  రెండేళ్ల క్రితం ఓ బుకీ షకిబ్‌తో సంప్రదింపులు జరిపాడు. అయితే బుకీ తనను సంప్రదించిన విషయం షకిబ్‌ ఐసీసీకి వెళ్లడించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది.   ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నమోదు […]

బిగ్ బ్రేకింగ్: షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ నిషేధం
Follow us

|

Updated on: Oct 29, 2019 | 7:45 PM

ప్రపంచ క్రికెట్‌లో ఏస్ ప్లేయర్‌గా రాణిస్తోన్న బంగ్లాదేశ్ ఆటగాడు, ఆ దేశ టీ20, టెస్ట్ జట్ల కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ నిషేదం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఆడకుండా రెండేళ్లు ఈ  నిషేధం వర్తిస్తుంది.  రెండేళ్ల క్రితం ఓ బుకీ షకిబ్‌తో సంప్రదింపులు జరిపాడు. అయితే బుకీ తనను సంప్రదించిన విషయం షకిబ్‌ ఐసీసీకి వెళ్లడించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది.   ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకిబ్‌ అంగీకరించిన నేపథ్యంలో ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది. చారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో కీలక టీం ఇండియా టూర్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

షకీబ్‌పై నమోదైన అభియోగాలు:

  1. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ట్రై సిరీస్ సందర్భంగా షకిబ్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెంటనే తెలపడంలో విపలమయినందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు…
  2. 2018 ఐపీఎల్‌‌లో ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వెర్సెస్ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా బుకీలు సంప్రదించడాన్ని వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది.

స్పందించిన షకీబ్: 

‘‘నేను ఎంతో ప్రేమించే ఆట నుంచి నన్ను నిషేధించడంతో చాలా బాధగా ఉంది. నా తప్పులను పూర్తిగా అంగీకరిస్తున్నా. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాను. ఆటగాళ్లు అవినీతిపై ధీటుగా పోరాటం చేయడానికి ఐసీసీ, ఏసీయూ ఎంతో తోడ్పడతాయి. నేను నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయా’’ అని పేర్కొన్నాడు.