ప్రయాణించాల్సిన విమానం మిస్… ఎల్పీఎల్ తొలి మ్యాచ్‌ నుంచి అప్రిది ఔట్

టైమ్ ఎంత గొప్పదో పాకిస్తాన్ ఆటగాడి విషయంలో మరోసారి నిరూపితమైంది. లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది శ్రీలంక వెళ్లాల్సిన విమానంను కొద్ది నిమిషాల క్రితం మిస్సయ్యాడు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:36 pm, Mon, 23 November 20
ప్రయాణించాల్సిన విమానం మిస్... ఎల్పీఎల్ తొలి మ్యాచ్‌ నుంచి అప్రిది ఔట్

టైమ్ ఎంత గొప్పదో పాకిస్తాన్ ఆటగాడి విషయంలో మరోసారి నిరూపితమైంది. లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది శ్రీలంక వెళ్లాల్సిన విమానంను కొద్ది నిమిషాల క్రితం మిస్సయ్యాడు. ఈ ఎఫెక్ట్ ఫలితంగా టోర్నమెంటులో గాలే తలపడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోతున్నాడు.

ఎందుకంటే అఫ్రిది లంక చేరుకున్నాక తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గ్లాడియేటర్స్ ఆడే తొలి మ్యాచులకు అఫ్రిది అందుబాటులో ఉండడం కష్టమే. ఈ ఉదయం కొలంబో విమానం మిస్సయింది. అయినప్పటికీ చింతించాల్సిన పనిలేదు. త్వరలోనే అక్కడికి చేరుకుని జట్టుతో కలుస్తా’’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

క్వారంటైన్ కారణంగా అఫ్రిది మ్యాచ్‌లకు అందుబాటులో లేకుంటే భనుక రాజపక్స జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 27న జాఫ్నా స్టాలియన్స్‌తో గాలే గ్లాడియేటర్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. గాలే గ్లాడియర్స్ జట్టుకు అఫ్రిదిని సారథి‌గా ఎంపిక చేయగా, స్థానిక ఆటగాడు భనుక రాజపక్సను వైస్ కెప్టెన్‌గా గాలే యాజమాన్యం నియమించింది.