‘సూసైడ్ బాంబర్ల బ్రీడింగ్ సెంటర్ షాహీన్ బాగ్’.. బీజేపీ మంత్రిగారి సెటైర్

సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్  వద్ద ధర్నా చేస్తున్నవారిపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచినట్టు ఆందోళనకారులను హేళన చేస్తున్నా.. ప్రధాని మోదీ కిమ్మనడం లేదు. వారి అనుచిత వ్యాఖ్యలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. తాజాగా మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా తానేమీ తక్కువతినలేదన్నట్టు.. వారిమీద నోరు పారేసుకున్నారు. ఢిల్లీ నుంచి దేశంపై కుట్ర పన్నడానికి షాహీన్ బాగ్ స్థలం సూసైడ్ బాంబర్ల బ్రీడింగ్ కేంద్రంగా మారిందని ఆయన […]

'సూసైడ్ బాంబర్ల బ్రీడింగ్ సెంటర్ షాహీన్ బాగ్'.. బీజేపీ మంత్రిగారి సెటైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 12:34 PM

సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్  వద్ద ధర్నా చేస్తున్నవారిపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచినట్టు ఆందోళనకారులను హేళన చేస్తున్నా.. ప్రధాని మోదీ కిమ్మనడం లేదు. వారి అనుచిత వ్యాఖ్యలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. తాజాగా మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా తానేమీ తక్కువతినలేదన్నట్టు.. వారిమీద నోరు పారేసుకున్నారు. ఢిల్లీ నుంచి దేశంపై కుట్ర పన్నడానికి షాహీన్ బాగ్ స్థలం సూసైడ్ బాంబర్ల బ్రీడింగ్ కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇది ఆందోళన కాదని, ఇక్కడ ఆత్మాహుతిదళ సభ్యులు పెరుగుతున్నారని, ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నే ప్లాన్ చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేసే ‘ మాస్టారయిన’ గిరిరాజ్ సింగ్ గతంలో కూడా బీజేపీ అధిష్టానం మెప్పు పొందేందుకు ఇలా ఇష్టం వఛ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు. ఇక హోం మంత్రి అమిత్ షా సైతం షాహీన్ బాగ్ నిరసనకారులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత డిసెంబరు 18 నుంచి వందలాది ఆందోళనకారులు ధర్నా చేస్తున్నారు. వీరిలో తమ పిల్లలతో సహా అనేకమంది మహిళలు కూడా ధర్నాకు కూర్చున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చేసే ప్రజలు ఈవీఎం లపై ఎంత ఆగ్రహంగా బటన్ నొక్కాలంటే అది షాహీన్ బాగ్ ఆందోళనకారులకు కరెంట్ షాక్ తగిలేలా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. కపిల్ మిశ్రా వంటి నేతలయితే ఈ ధర్నాచేస్తున్నవారిని పాకిస్థానీయులుగా పోల్చారు. షాహీన్ బాగ్ లో పాకిస్తాన్ ఎంటరయిందని, పోలింగ్ రోజున ఇండియాకు, పొరుగున ముస్లిం జనాభా ఉన్న ప్రాంతానికి మధ్య ‘ పోటీ’ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆందోళనకారులు ఇన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారని ఆయన అన్నారు..