బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా… మరో ఆర్నెల్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత అమిత్ షా ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నారు . ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా… ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ప్రధానంగా… మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ నేతలతో అమిత్ షా… బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటూ జమ్మూకాశ్మీర్‌కి కూడా ఈ […]

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా... మరో ఆర్నెల్లు
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 1:27 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత అమిత్ షా ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నారు . ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా… ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.

ప్రధానంగా… మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ నేతలతో అమిత్ షా… బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటూ జమ్మూకాశ్మీర్‌కి కూడా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని సూచించిన అమిత్ షా… ఆల్రెడీ కేంద్రంలో ఎక్కువ సీట్లతో గెలిచాం కదా అని తేలిగ్గా తీసుకోవద్దనీ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తనకు రిపోర్టులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం మహారాష్ట్రతోపాటూ జార్ఖండ్, హర్యానాలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 28 స్థానాలతో పీడీపీ మొదటి పొజిషన్‌లో ఉండగా… 25 సీట్లతో బీజేపీ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందువల్ల… తమ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల సంగతి ముందుగా తేల్చాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్నది కాంగ్రెస్సే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోకూడదని భావిస్తున్న షా… ఇప్పటి నుంచే స్థానిక నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..