బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షసూచన

వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షసూచన
Follow us

|

Updated on: Aug 20, 2020 | 4:04 PM

వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నెలకొంది. అది వాయుగుండంగా మారింది. దీంతో గురువారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఈ నెల 23వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, వాయువ్య బంగాళాఖాతంలో ఈ ఏర్పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. శుక్రవారం తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు వర్షపాతం సాధారణం కంటే 44 శాతం అత్యధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలోనూ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?