ఆ రెండు రాష్ట్రాలకు ఎన్‌డీఎమ్ఏ అలర్ట్..ముంచుకొస్తున్న ముంపు

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలను వర్షాలు, వరదలు ముంచేత్తుతున్నాయి. అస్సాం, బీహార్ రాష్ట్రాలకు తీవ్ర వరదలు వచ్చే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ( నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) హెచ్చరించింది. అస్సాంలోని పలు నదులు గరిష్ట స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని...

ఆ రెండు రాష్ట్రాలకు ఎన్‌డీఎమ్ఏ అలర్ట్..ముంచుకొస్తున్న ముంపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 6:03 PM

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలను వర్షాలు, వరదలు ముంచేత్తుతున్నాయి. అస్సాం, బీహార్ రాష్ట్రాలకు తీవ్ర వరదలు వచ్చే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ( నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) హెచ్చరించింది. అస్సాంలోని పలు నదులు గరిష్ట స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వెల్లడించిందని పేర్కొంది. అస్సాంలోని సిబ్‌సాగర్ జిల్లా నాగలమోరాఘాట్‌లోని దిస్సాంగ్ నది, గోలాఘాట్ జిల్లాలోని నాగలమోరాఘాట్ (దక్షిణభాగంలోని) ధన్‌శ్రీ నది, జోహట్ జిల్లా నిమటిఘాట్‌లోని బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఎన్‌డీఎంఏ తెలిపింది. సొనత్‌పూర్ జిల్లాలోని జయబరేలీ నది, నాగలమోరాఘాట్‌లోని దిస్సాంగ్ నదులు ఆయా జిల్లాల్లో వరదలకు కారణమయ్యే అవకాశముందని వెల్లడించింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో నిదుమరియ ఘాట్‌లో ప్రవహించే గండక్ నది సీతామార్హి రున్నిసైద్‌పూర్ వద్ద భాగమతి నదితో కలిసి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ఎన్‌డీఎమ్ఏ తెలిపింది.