70 ఏళ్లుగా నలుగుతున్న ‘ అయోధ్య ‘.. ‘ సయోధ్య ‘ ఎప్పుడు ?

దేశాన్ని పట్టి కుదిపేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఎటూ నిర్ణయం తీసుకోలేక తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 2.77 ఎకరాల వివాదాస్పద రామజన్మ భూమి-బాబరీ మసీదు స్థలంపై హక్కు కోసం 70 ఏళ్లుగా లిటిగెంట్ల వాద, ప్రతివాదాలకు ఏం చెప్పాలో తెలియక అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. తన తీర్పును వచ్ఛే నవంబరు వరకు దాదాపు ‘ వాయిదా ‘ వేసింది. అసలు ఈ వివాదంపై ఎన్ని ‘ […]

70 ఏళ్లుగా నలుగుతున్న ' అయోధ్య '.. ' సయోధ్య ' ఎప్పుడు ?
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2019 | 12:28 PM

దేశాన్ని పట్టి కుదిపేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఎటూ నిర్ణయం తీసుకోలేక తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 2.77 ఎకరాల వివాదాస్పద రామజన్మ భూమి-బాబరీ మసీదు స్థలంపై హక్కు కోసం 70 ఏళ్లుగా లిటిగెంట్ల వాద, ప్రతివాదాలకు ఏం చెప్పాలో తెలియక అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. తన తీర్పును వచ్ఛే నవంబరు వరకు దాదాపు ‘ వాయిదా ‘ వేసింది. అసలు ఈ వివాదంపై ఎన్ని ‘ ముసురులు ‘ ? ఎన్ని కేసులు ? ఈ స్థలాన్ని రామ్ లాలా నిర్మోహి అఖారా, యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు సమానంగా పంచుకోవాలంటూ 2010 లో అలహాబాద్ హైకోర్టు ఇఛ్చిన తీర్పును రెండు పక్షాలూ నిరాకరించాయి. దీంతో ఇది సుప్రీంకోర్టుకెక్కింది. కోర్టులో 40 రోజుల పాటు వాదనలు కొనసాగినప్పటికీ.. చివరకు నవంబరు 17 లోగా తుది తీర్పు నిస్తామని కోర్టు ప్రకటించింది. అసలు ఆయా కోర్టుల్లో 70 ఏళ్ళ లిటిగేషన్ల వివరాల్లోకి వెళ్తే..

1885 : వివాదాస్పద స్థలం బయట ఓ చిన్న ఆలయ కట్టడం వంటి నిర్మాణానికి అనుమతించాలంటూ మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది.

1949 : సంబంధిత స్థలం బయట సెంట్రల్ డోమ్ కింద రామ్ లాలా విగ్రహాలను ప్రతిష్టించారు.

1950 : రామ విగ్రహాలను పూజించేందుకు అనుమతించాలంటూ గోపాల్ సిమ్లా విశారద్ ఇదే కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే పూజలు చేసేందుకు, విగ్రహాల భద్రతకు అనుమతించాలని పరమహంస రామచంద్ర దాస్ కూడా దావా వేశారు.

1959 : ఈ స్థలాన్ని తమకు అప్పగించాలని, ఇందుకు పర్మిషన్ ఇవ్వాలని నిమోహీ అఖారా కూడా దావా వేసింది.

1981 : అయితే తమకే ఈ హక్కు ఉందంటూ యూపీలోని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కూడా దావా దాఖలు చేసింది.

1986 ఫిబ్రవరి : హిందూ భక్తులకు ఈ స్థలాన్ని అప్పగించాలని స్థానిక కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

1989 ఆగస్టు 14 : యధాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం

1993 ఏప్రిల్ 3 : వివాదాస్పద స్థలంలో కొంత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్రం ఇందుకు సంబంధించి అయోధ్య చట్టాన్ని తెచ్చింది. అయితే ఈ చట్టంలోని వివిధ అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫరూఖీ అనే వ్యక్తి తో బాటు పలువురు అలహాబాద్ కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. 139 అధికరణం కింద సుప్రీంకోర్టు తన అధికార పరిధి మేరకు వీటిని తిరిగి అలహాబాద్ కోర్టుకు బదలాయించింది. అవి పెండింగులో ఉంటూ వచ్చాయి.

1994 అక్టోబర్ 24 : మసీదు అన్నది ఇస్లామ్ లో అంతర్భాగం కాదని అత్యున్నత న్యాయస్థానం ఇస్మాయిల్ ఫరూకీ కేసులో తీర్పు నిచ్చింది.

2002 ఏప్రిల్ : ఈ స్థలంపై ఎవరికి హక్కు ఉండాలన్నదానిపై అలహాబాద్ కోర్టు విచారణ ప్రారంభించింది.

2010 సెప్టెంబర్ 30 : దీన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిమోహీ అఖారా సరిసమానంగా పంచుకోవాలని 2 :1 నిష్పత్తిలో హైకోర్టు తీర్పునిచ్చింది.

2011 మే 9 : అయోధ్య భూ చట్టంపై కోర్టు ఇఛ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే జారీ.

2017 మార్చి 21 : సంబంధిత పార్టీలు కోర్టు బయట దీన్ని పరిష్కరించుకోవాలని అప్పటి చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖేరా తీర్పునిచ్చారు.

2017 ఆగస్టు 7 : 1994 నాటి అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది.

2018 ఫిబ్రవరి : సివిల్ అపీళ్ల విచారణను కోర్టు ప్రారంభించింది. సెప్టెంబరు 27 : ఈ కేసును అయిదుగురు జడ్జీల ధర్మాసనానికి నివేదించేందుకు కోర్టు నిరాకరించింది. కొత్తగా ఏర్పాటు చేసే ముగ్గురు జడ్జీల ధర్మాసనం అక్టోబరు 29 న ఈ కేసును విచారించాలని సూచించింది.

2019 జనవరి 8 : చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వాన అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని కోర్టు ఏర్పాటు చేసింది.

జనవరి 29 : వివాదాస్పద స్థలం చుట్టూ గల 70 ఎకరాల భూమిని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని కేంద్రం కోర్టులో పిటిషన్ వేసింది.

ఫిబ్రవరి 26 : కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటుకు కోర్టు అంగీకారం.

మార్చి 8: మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం.కైఫుల్లా ఆధ్వర్యాన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

ఆగస్టు 1 :మధ్యవర్తిత్వకమిటీ తన నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది.

ఆగస్టు 6 : సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది.

అక్టోబరు 16 : విచారణ ముగించిన కోర్టు.. తీర్పును రిజర్వ్ లో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం.

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌
సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌
ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా
ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా
లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి
లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.